టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు.ఈ సంవత్సరం ఇప్పటికే మేజర్ లాంటి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్.. ఇప్పుడు హిట్-2 సినిమా రూపంలో మరో సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఇక తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. వసూళ్ల పరంగా అదరగొడుతున్న హిట్-2 సినిమా ఇక ఓవర్స్ సీస్‌లో కూడా బాక్సాఫీస్‌ను బాగా షేక్ చేస్తోంది. అమెరికాలో అయితే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను అందుకొని ఆశ్చర్య పరిచింది.ఫస్ట్ వీకెండ్ లోనే కాకుండా సెకెండ్ వీకెండ్‌లో కూడా హిట్-2 వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం పడలేదు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం ఇంకా అలాగే వచ్చిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హిట్-2 సినిమాకు ఆదరణ ఎక్కువగా ఉంది.


ఇక యూఎస్ఏలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ డీసెంట్ వసూళ్లు రాగా.. రెండో వీకెండ్‌కు ఏకంగా 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. దీంతో అడివి శేష్ ఈ సంవత్సరం తను నటించిన రెండు సినిమాలకు ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటికే మేజర్ సినిమా కూడా ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. తాజాగా హిట్-2 సినిమా ఈ రికార్డును అందుకుంది.ఇంకా అంతేకాకుండా  మరో రికార్డు కూడా సాధించింది.సెన్సార్ నుంచి 'A' సర్టిఫికేట్ పొంది 1 మిలియన్ డాలర్ మార్కును అందుకున్న రెండో తెలుగు సినిమాగా కూడా హిట్-2 రికార్డు సృష్టించింది. అంతకుముందు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ఈ విధంగా వసూళ్లను అందకుంది. ఇప్పుడు ఆ రికార్డుని శేష్ బద్దలు కొట్టడం విశేషం.ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా ఇప్పటికీ ఇంకా దూసుకెళ్తూనే ఉంది. మొత్తంగా రూ.60 కోట్ల గ్రాస్‌ దాకా ఈ సినిమా వసూలు చేసినట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: