కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ కథానాయకుడిగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తరికెక్కిన తాజా చిత్రం 'సార్'. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. చదువు యొక్క గొప్పతనం, చదువు విషయంలో కార్పొరేట్ సంస్థల తీరు, ప్రభుత్వ విద్య విధానాల మీద విమర్శలు జోడిస్తూ తెరకెక్కించిన సార్ అందరినీ ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. గత 20 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులను తీసుకొని డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమాలో చదువు యొక్క గొప్పతనం గురించి దర్శకుడు చూపించిన తీరు ప్రతి ఒక్క ఆడియన్స్ నీ కదిలిస్తోంది. 

చదువు కోసం మధ్యతరగతి వాళ్ళు పడే కష్టాలను, పేదవారికి చదువు ఎందుకు దూరం అవుతుంది అని చెప్పేందుకు దర్శకుడు రాసుకున్న కథ,, కథనం.. డబ్బుని ఎలాగైనా సంపాదించవచ్చు కానీ మర్యాదను మాత్రం చదువుతూనే సంపాదించుకోవచ్చు అంటూ సినిమాలో ఉండే డైలాగ్స్ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి. ఇక సినిమాలో ధనుష్ నటన మెయిన్ హైలెట్. సినిమా మొత్తంలో ధనుష్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పవచ్చు. మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరో ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ లో నటించడం ఒకెత్తు అయితే.. ఈ మూవీ ని ఆడియన్స్ మెచ్చే లా నటించడం మరో ఎత్తు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా రెండు చోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

అయితే తాజాగా ఈ సినిమాను తమకు ఉచితంగా చూపించాలంటూ కొంతమంది విద్యార్థులు రోడ్డుకెక్కారు. సార్ సినిమాని ఉచితంగా చూపించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ వీడియోకాస్త సార్ నిర్మాత నాగవంశి కంట్లో పడింది. దీంతో వెంటనే నాగ వంశీ స్పందించాడు.' సార్ సినిమాను తీసింది చదువు విలువ తెలియాలి అని. ఇంకా స్కూల్ పిల్లలు ఫ్రీగా చూపించండి అని అడుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. మీ వివరాలని పంపించండి. నేను మీకు ఉచితంగా సార్ సినిమాను ఫ్రీ షో వేసేలా చూస్తాను..' అని ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఇక ఇక సార్ సినిమా కథను డైరెక్టర్ వెంకీ అట్లూరి మన టాలీవుడ్ లో చాలామంది హీరోలకు వినిపించాడు. కానీ ఏ ఒక్కరు కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ధనుష్ కి1వినిపించగానే ఆయన ఓకే చేశాడు. ఫలితంగా చాలా గ్యాప్ తర్వాత వెంకీ అట్లూరికి సార్ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ పడింది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: