రామ్ చరణ్  ఇప్పటికి ఆస్కార్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తునే వున్నాడు... యూఎస్ నుండి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి ఆయన చేతుల మీదుగా సన్మానం అందుకోవడం కూడా జరిగింది..

అలాగే ఇండియా టుడే లాంటి నేషనల్ ఛానెల్ లో రాజ్ డీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్ట్ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేసిన సంగతి తెలిసిందే.

ఇలా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్  సినిమాతో వచ్చిన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించుకుని తనని తాను ఒక బ్రాండ్ లా ప్రమోట్ చేసుకుంటూ బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఈయన ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడం నెక్స్ట్ సినిమాలకు కూడా ఎంతో ప్లస్ అయ్యే అవకాశం ఉంది.. అయితే రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా ప్రమోట్ అవ్వడానికి కారణం ఆయన వెనుక ఉన్న భార్య ఉపాసన అనే అందరూ చెబుతున్నారు.. ఈమె నెట్ వర్క్ తోనే చరణ్ ను స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుందని తెలుస్తుంది. మెగా పిఆర్ టీమ్ కూడా చరణ్ ను ప్రమోట్ చేయడంలో ఎంతో బలంగా పని చేస్తుంది.. ఇంకా మెగాస్టార్ బ్రాండ్, అపోలో ఫ్యామిలీకి అలాగే చిరుకి బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా చరణ్ ను నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగ పడుతుందని చెప్పాలి.అయితే ఒకే సినిమాతో హిట్ అందుకున్న ఎన్టీఆర్ కు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రమోషన్ రావడం లేదనే చెప్పవచ్చు.చరణ్ కు నేషనల్ మీడియా ఇచ్చినంత ఫోకస్ ఎన్టీఆర్ కు ఇవ్వడం లేదని తెలుస్తుంది.ఇది ఫ్యాన్స్ ను బాగా నిరాశకు గురి చేస్తుంది.. ఇందుకు మరో కారణం కూడా చెప్పాలి.. ఈయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఫ్యామిలీ కూడా పెద్దగా సపోర్ట్ అయితే చేయలేదు.. అలాగే నందమూరి ఇమేజ్ కూడా నేషనల్ లెవల్ లో ఇమేజ్ ను తేలేకపోతుంది.. దీంతో ఎన్టీఆర్ ముందు నుండి సింగిల్ గానే తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పాలి... ఇది గ్రేట్ ఎంతో అనే చెప్పవచ్చు... అందుకే చరణ్ కు నేషనల్ లెవల్ లో లభిస్తున్నంత పాపులారిటీ ఎన్టీఆర్ కు లభించడం లేదని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: