ప్ర‌పంచంలోనే అత్యంత ..అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రిగా ప‌నిచేశారు. ప‌నిచేసింది కొద్ది కాల‌మే కావ‌చ్చు..కానీ కొన్ని త‌రాల పాటు..కొన్నేళ్ల పాటు ..భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌నం ఉండేలా చేసిన ఘ‌న‌త రాజీవ్ గాంధీది మాత్ర‌మే. అవ‌గాహ‌న రాహిత్యంతో ..కుత్సిత బుద్ధితో ఆరోప‌ణ‌లు చేసినంత మాత్రాన చ‌రిత్ర చెరిగి పోదు. కావాల‌ని చెరిపివేస్తే ..మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌నం గుండెల‌లోంచి జ‌రిగిన క‌థ పున‌రావృత‌మ‌వుతూనే ఉంటుంది. ఇది న‌గ్న స‌త్యం. చారిత్రిక వాస్త‌వం కూడా. ఇండియా గురించి ఏదైనా మాట్లాడాల్సి వ‌స్తే..రాజీవ్ గాంధీ కంటే ముందు..రాజీవ్ గాంధీ కంటే వెనుక గురించి మాత్ర‌మే మాట్లాడాలి లేదా గుర్తుకు తెచ్చుకోవాలి. దేశంలో..ప్ర‌పంచంలో అత్యంత ధ‌న‌వంత‌మైన కుటుంబాల‌లో ఒక‌రిగా పేరున్న గాంధీ ఫ్యామిలీ నుంచి ఆయ‌న అనుకోకుండా ఇండియ‌న్ పాలిటిక్స్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. 


ఇది ఒక‌ర‌కంగా ఆయ‌న‌ను కెరీర్ ప‌రంగా ఉన్న‌త స్థానాన్ని అధిరోహించేలా చేసింది. కానీ ఆయ‌న ఏరోజూ త‌న వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను మాత్రం పొంద‌లేక పోయారు. రాజీవ్ గాంధీ చ‌దువ‌రి, మేధావి, చెప్ప‌డం కంటే విన‌డం ఎక్కువ‌గా అల‌వాటు చేసుకున్న ఈ అరుదైన వ్య‌క్తి ఒక దార్శ‌నికుడిగా..ఆచ‌ర‌ణాత్మ‌క‌మైన వాదిగా..అందివ‌చ్చిన లీడ‌ర్‌గా..ఓవ‌ర్ ఆల్ గా డైన‌మిజం క‌లిగిన వ్య‌క్తిగా ..ఈ పొలిటిక‌ల్ ప్లాట్ ఫాంలోకి వ‌చ్చారు. అప్ప‌టి నుంచి ప్ర‌కృతిని ప్రేమించి..అంత‌ర్ముఖుడిగా ఉంటూ త‌న‌కు తోచిన రీతిలో ప‌ని చేసుకుంటూ మౌనంగా ఉండి పోయిన రాజీవ్ గాంధీ ..త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా చేశాయి. త్యాగాల‌కు, బ‌లిదానాల‌కు కేరాఫ్ నెహ్రూ..గాంధీ కుటుంబం. 


ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కురాలిగా , ప్ర‌ధాన‌మంత్రిగా దివంగ‌త ఇందిరాగాంధీ పేరు తెచ్చుకున్నారు. ఇండియా అంటే ఇందిర‌..ఇందిర అంటే ఇండియా అన్న రీతిలో దేశాన్ని పాలించారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఎవ‌రికీ త‌ల‌వంచ‌లేదు. అతిర‌థ మ‌హార‌థులు, ఉద్దండ రాజ‌కీయ వేత్త‌లు, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ఆమెలోని ధైర్యానికి, నాయ‌క‌త్వ ప‌టిమ‌కు స‌లాం చేయ‌కుండా ఉండ‌లేక పోయారు. ఇదే స‌మ‌యంలో ఆమె ప్ర‌ధాన‌మంత్రిగా ఓ వైపు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే త‌న పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. సంజ‌య్ గాంధీ విమాన ప్ర‌మాదంలో త‌నువు చాలించారు. ఇందిరాగాంధీని ..ఆ కుటుంబాన్ని షాక్‌కు గుర‌య్యేలా చేసింది. త‌మ్ముడు పోటీ చేసిన అమేథి నుంచి రాజీవ్ గాంధీ ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. భారీ మెజారిటీతో పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. 


పార్టీ ఆయ‌న‌ను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించింది. అక్క‌డి నుంచి దేశ రాజ‌కీయాల‌ను, అత్యున్న‌త‌మైన చ‌ట్టాల‌ను త‌యారు చేసి..ఆమోదింప చేసే పార్ల‌మెంట్ ను రాజీవ్ గాంధీ అర్థం చేసుకున్నారు. ప్ర‌తి అంశాన్ని, స‌మ‌స్య‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డం..దాని గురించి లోతైన అవ‌గాహ‌న తెచ్చుకోవ‌డం చేశారు. అందుకే ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. త‌న త‌ల్లి ఇందిరాగాంధీని అంగ‌ర‌క్ష‌కుడు కాల్పులు జ‌రిపిన సంఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌పంచం ఆశ్చ‌ర్యానికి లోనైంది. దేశమంత‌టా ఆందోళ‌న‌లు, ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతూ ప్రార్థ‌న‌లు వెల్లువెత్తాయి. నిన్న‌టి దాకా దేశాన్ని ప్ర‌పంచం గ‌ర్వించేలా చేసిన నాయ‌కురాలిగా వినుతికెక్కిన ఆమె పోక‌డ‌ను కొన్ని శ‌క్తులు జీర్ణించుకోలేక పోయాయి. ఈ సంక్షుభిత స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుతూ రాజీవ్ గాంధీ కోట్లాది ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇదీ నాయ‌క‌త్వం అంటే ఏమిటో తెలుసొచ్చింది. ఆ త‌ర్వాత దేశానికి 6వ ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు రాజీవ్ గాంధీ. 


ప్ర‌తి భారతీయుడు ..ప్ర‌తి గ్రామం టెలికాం సేవ‌ల‌ను వినియోగించాల‌ని ఆయ‌న ఆలోచించారు. ఆ దిశ‌గా భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌కు ఒక బ్రాండ్ ఉండేలా చేశారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ట్రాయ్ బ‌ల‌మైన సంస్థ‌గా రూపు దిద్దుకునేలా స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించారు. శ్యామ్ పిట్రోడా టెలికాం రంగం విస్త‌రించేందుకు..ప్ర‌తి ఒక్క‌రు ఆ టెలికాం టెక్నాల‌జీని ఉప‌యోగించుకునేలా చేసిన ఘ‌న‌త రాజీవ్ గాంధీదే. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌డం, వారికి ఎన‌లేని సౌక‌ర్యాల‌ను క‌ల్పించిన చ‌రిత్ర కూడా ఈ నాయ‌కుడిదే. ప్ర‌తిప‌క్ష నేత అట‌ల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిప‌దిక‌న ఆర్థిక స‌హాయం మంజూరు చేసిన చ‌రిత్ర రాజీవ్ దే. ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీపై అవాకులు చెవాకులు పేలారు. ఒక ప్ర‌ధాని స్థానంలో ఉంటూ అనాల్సిన మాట‌లు కావ‌వి. ఆయ‌న త‌న స్థాయికి దిగ‌జారి వ్యాఖ్యానించారు.ఏనాడో అత్యున్న‌త న్యాయ‌స్థానం రాజీవ్ గాంధీపై ఉన్న కేసుల‌ను కొట్టి వేసింది. ఎక్క‌డా రూఢీ కాలేదు. ఎన్ని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసినా రాజీవ్ అందించిన స్ఫూర్తిని ఎవ‌రూ చెరిపి వేయ‌లేరు. 



32 మంది స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా క్రీడ‌ల‌ను అభివృద్ధి చేసేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారు రాజీవ్ గాంధీ. ఆయ‌న హ‌యాంలోనే దేశంలో ఏసియ‌న్ గేమ్స్ విజ‌య‌వంతంగా జ‌రిగాయి. క్రీడ‌ల‌ను ప్రేమించారు. క్రీడాకారుల‌కు భారీ ప్యాకేజీలు ప్ర‌క‌టించారు. అవార్డులు, పుర‌స్కారాలు అంద‌జేశారు. ఎక్క‌డ ఏ ఆట జ‌రిగినా దానిని ప్రోత్స‌హించాల‌ని త‌న పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు ఇత‌ర పార్టీల‌కు  చెందిన వారికి కూడా సూచించే వారు. అంత‌లా ఆయ‌న ఈ దేశంతో..ఈజాతితో మిళిత‌మై పోయారు. ఇక్క‌డి సంస్కృతి, వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను, ప్ర‌జ‌ల దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న అనేకానేక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. మ‌హాత్ముడు క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యం ప‌రిఢ‌విల్లేలా..ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త రాజీవ్‌దే. పంజాయ‌తీరాజ్ చ‌ట్టానికి ప్రాణం పోశారు. 


విదేశీ పాల‌సీని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేశారు. విదేశాల‌తో ద్వైపాక్షిక సంబంధాల‌ను స‌క్సెస్ ఫుల్‌గా కొన‌సాగించారు. యాంటీ డిఫెక్ష‌న్ లా అమ‌ల‌య్యేలా..పార్టీని విడిపోయి ఇత‌ర పార్టీల‌కు చేరేందుకు య‌త్నించే వారిని క‌ట్టుదిట్టం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆయ‌న హ‌యాంలోనే ఇండియా, పాకిస్తాన్ సంబంధాలు మ‌రింత మెరుగు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత శ్రీ‌లంకతో ద్వైపాక్షిక సంబంధం నెరిపేందుకు సంత‌కాలు చేశారు. అదే కొంప ముంచింది. ఎల్‌టిటిఇ చీఫ్ ప్ర‌భాక‌ర‌న్ ..త‌మ‌ను నిర్వీర్యం చేసేందుకు రాజీవ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పొర‌పాటు ప‌డ్డారు. మాన‌వ బాంబును ప్ర‌యోగించేలా చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా త‌మిళ‌నాడులోని పెరంబ‌దూర్ లో కోట్లాది జ‌నాన్ని త‌న స్వంత మ‌నుషులుగా ప్రేమించిన ..అరుదైన నాయ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. దేశం క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. ప్ర‌పంచం శోక‌సంద్రంలో మునిగి పోయింది. 


పాల‌న‌ల‌తో తాత‌ను మైమ‌రిపించి..నిర్ణ‌యాల‌లో త‌ల్లిని జ్ఞాప‌కం తెచ్చేలా చేసి..తన‌ను తాను అరుదైన రాజ‌కీయ నాయ‌కుడిగా మ‌ల్చుకుని ..క‌ల‌లు క‌న‌డ‌మే కాదు వాటిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చిన జాతీయ నేత‌ల్లో రాజీవ్ గాంధీ ఒక‌రు. ఆయ‌న చ‌నిపోయి 28 ఏళ్లు అయ్యాయి. ఇవాళ త‌ప్ప‌క స్మ‌రించు కోవాల్సిన స‌మ‌యం. తమ తండ్రిని చంపిన వారికి క్ష‌మాభిక్ష పెట్టండంటూ వేడుకున్నారు రాజీవ్ గాంధీ పిల్ల‌లు రాహుల్, ప్రియాంక గాంధీలు. ఇలాంటి స‌న్నివేశాలు ప్ర‌పంచంలో ఎక్క‌డ వెదికినా ..ఏ చ‌రిత్ర క‌దిపినా అగుపించ‌వు. శ‌త్రువును క్ష‌మించే గుణం అరుదైన వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ఉంటుంది. త్యాగాల‌కే కాదు..ప‌ద‌వుల‌ను తృణ ప్రాయంగా త్య‌జించిన చ‌రిత్ర వారిది. ఇండియాకు ఐటీ రంగం ప‌ట్ల‌, ఆర్థిక పాల‌సీని తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త రాజీవుడిదే. 



ఫారిన్ పాల‌సీని విజ‌య‌వంతంగా న‌డిపించారు. ఎన్నో దేశాల‌తో క‌ర‌చాల‌నం చేశారు. ఇత‌ర దేశాల‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో ఆయ‌న‌కు లేచి నిల‌బ‌డి గౌర‌వించారు. ఇది కొద్ది మంది నేత‌ల‌కు మాత్ర‌మే ద‌క్కుతుంది. రాజీవ్ గాంధీ నిండైన వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌నం ఈ స‌న్నివేశం. ఇవాళ ఆయ‌న భౌతికంగా లేరు..కానీ ఆయ‌న ఆశించిన స‌మాజం..భ‌విష్య‌త్ ద‌ర్శ‌నం ఇపుడు వాస్త‌వ రూపంలో క‌నిపిస్తోంది. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ..రాజీవ్ గాంధీ రూపం ప‌ల‌క‌రిస్తూనే ఉంటుంది. ప్ర‌తి హృద‌యంలో ప్రేమ వెల్లివిరిసేలా చేస్తుంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: