
ఊరికి కష్టం వస్తే అది తన కష్టం కాకుండా పోదు
అవును! రా రా శ్రీమంతుడా!
అవును! వచ్చాడయ్యో సామీ.. అని అనుకోవాల మేము
పండగలా దిగివచ్చావు అని పాడుకోవాల..
మరి! ఆ సందర్భం వస్తుందా లేదో!
నువ్వు దేవుడివి సామీ అని అనిపిస్తాడో లేదా
అరిపిస్తాడో... తెలియాలి మనకు
ఎవరు ఎలాంటి వారో ఎంతటి ఉదారవాదులో
తెలుసుకోవాలి మనం
దేవుడంటే సాయం అని అతడు సినిమాలో
చెప్పిన డైలాగులు మరిచిపోయిన మహేశ్ బాబుకు
ఈ సందర్భంగా ఓ కృతజ్ఞత మరియు ఓ ధన్యవాద
ఎప్పటికప్పుడు కష్టాలనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కన్నీళ్లన్నవి చుట్టు ముడుతూనే ఉంటాయి. కానీ మన మురారి సంకల్పం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అతడు పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం కదా! మరేంటి ఇలా నీరొచ్చి ముంచితే నిప్పు కణం ఏమయింది చల్లారిపోయిందా? ఏమో! మరి! విప్తతులు వచ్చి ఇంట తిష్ట వస్తే ఆదుకోవాల్సిన హీరో
ఇప్పుడేం చేస్తున్నారో తెలియరావడం లేదు. బిజినెస్ మెన్ బిజీబిజీగా ఉన్నారా. లేదా పోకిరి సినిమాలో చెప్పిన విధంగానే తిన్నామా తిరిగామా తెల్లారిందా అన్న విధంగా ఉన్నారా? ఏమో మరి! వీటికి కాలమే సమాధానం చెబుతుంది. మనం నిమిత్త మాత్రులం కనుక తలనొప్పి టాబ్లెట్ వేసుకుని తప్పుకు పోవాలి అని అంటారా..అలానే కానివ్వండి సర్..మీకు అడ్డా. మీకు ఎదురా?
సినిమా అంటే బాధ్యత బాధ్యత అంటే మహేశ్ బాబు అని చాలా సార్లు ఆ సామితో చెప్పించారు. అవును! ఆ సామి కూడా అలానే బాధ్యత ఉండక్కర్లే అని అరిచారు. బాధ్యత లేకపోతే సంబంధిత సినిమా సందర్భాల్లో తెగ బాధపడిపోయారు కూడా! దీన్నెవ్వరూ కాదనరు. దీనిని సినిమాటిక్ కాన్వర్ సేషన్ అని అంటారు కనుక వాటిని అలానే చూసి వదిలేద్దామా లేదా మా హీరో చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఆయనకు సర్కారు వారి పాట అనే సినిమా కన్నా డైరెక్టర్ పరశురామ్ కన్నా ఈ సమాజమే ముఖ్యం అని నిరూపిస్తారా?