రాష్ట్రపతి రాష్ట్రపతి అన్నారు. తీరుచూస్తే ద్రపౌది ముర్ము రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రపతిగా ఎంపికచేయనందుకు దక్షిణాధి రాష్ట్రాలు తమకు ప్రత్యేకమైన దేశం కావాలనే డిమాండ్లు మొదలుపెట్టినట్లు ఎల్లోమీడియా పిచ్చి వాదనలు వినిపించింది. అప్పటికేదో వెంకయ్య దేశ్ కీ నేతా అన్నట్లుగా ఎల్లోమీడియా పే...ద్ద బిల్డప్ ఇచ్చింది. తీరాచూస్తే మోడి అండ్ కో వెంకయ్యను అసలు దేకనే దేకలేదు.






ఇపుడు మళ్ళీ అదే పిచ్చిరాతలు మొదలుపెట్టింది. అదేమిటంటే వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా రెండోసారి అవకాశం ఇచ్చే ఛాన్సున్నట్లు పిచ్చిరాతలు మొదలుపెట్టింది. దీనికి లాజిక్ ఏమిటంటే రాష్ట్రపతిగా ఒడిస్సాకు చెందిన ద్రౌపదిని ఎంపికచేసారు కాబట్టి ఉపరాష్ట్రపతిగా దక్షిణాధికి చెందిన ఏపీ నేత వెంకయ్యనే కంటిన్యుచేసే అవకాశముందనేది ఆ పిచ్చిరాతల సారాంశం. పనిలోపనిగా వెంకయ్య పేరు మాత్రమే రాస్తే బావోదని తమిళనాడుకు చెందిన తెలంగాణా, పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై పేరును కూడా జతచేశారు.





నిజానికి వెంకయ్యను కంటిన్యుచేస్తున్న సంకేతాలు మోడీ దగ్గర నుండి ఏరోజూ కనబడలేదు. క్రియాశీల రాజకీయాల నుండి తప్పించాలన్న ఏకైక ప్లాన్ తోనే వెంకయ్యను మోడి ఉపరాష్ట్రపతిగా పంపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉపరాష్ట్రపతిగా ఏ ముస్లిం మైనారిటీనో లేకపోతే ఏ సిఖ్ఖు నేతనో ఎంపికచేయబోతున్నారనే ప్రచారం తెలిసిందే. వెంకయ్యకు ఎక్సటెన్షన్ ఇవ్వటం వల్ల పార్టీకి వచ్చే ఉపయోగం కూడా ఏమీలేదు.  ఈయనేమీ జనబలం ఉన్న నేతకాదు. వెంకయ్యను కంటిన్యుచేయటం వల్ల పార్టీపరంగా ఏపీలో వచ్చే లాభంకూడా ఏమీలేదు.





కాబట్టి వెంకయ్యను కంటిన్యుచేయటం అన్నది దాదాపు ఉండదనే అనుకోవాలి. ఎల్లోమీడియా చెప్పిందనో లేకపోతే ఎల్లోమీడియాకు బాగా ఇష్టుడనో మోడీ నిర్ణయం తీసుకోరు. మోడీ తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీకి లాభం జరిగేట్లుగానే ఉంటుందనటంలో సందేహం అక్కర్లేదు. ఈలోగా వెంకయ్య పేరును పదే పదే రాస్తున్నారంటే ఉపరాష్ట్రపతి పరువును సాంతం తీసేస్తున్నారనే అనుకోవాలి. ఉపరాష్ట్రపతిగా ఇంకెవరినైనా ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ పిచ్చి డిబేట్లు నడిపి తృప్తపడటం తప్ప ఎల్లోమీడియా చేయగిలిగేదేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: