
ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ప్రేక్షకులందరిలో ఉత్కంఠ నిండిపోయింది. ఇక చివరి బంతి వరకు సాగిన మ్యాచ్లో చివరికి రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా జట్టు. కాగా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా 1-0 తేడాతో ఆదిక్యాన్ని సంపాదించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటిసారి భారత జట్టు తరఫున టీ20 మ్యాచ్ లో ఆడిన శివమ్ మావి డెబ్యు మ్యాచ్ లోనే అదరగొట్టాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే తన ప్రదర్శన గురించి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేను బంతిని విడుదల చేసే ప్రదేశం కాస్త జారినట్లు అనిపించింది. అండర్ 19 క్రికెట్ తర్వాత దాదాపు 6 ఏళ్ల పాటు జాతీయ జట్టులో స్థానం దక్కుతుంది ఏమో ఎదురుచూసిన కొన్ని కొన్ని సార్లు గాయాల పాలు అయ్యాను. ఇక నా కల అలాగే మిగిలిపోతుంది ఏమో అని ఎన్నోసార్లు ఆందోళన చెందాను. కానీ ఐపీఎల్ ఆడుతున్నప్పుడల్లా నా కల సజీవంగా ఉంది అని అనిపించేది. పవర్ ప్లే లో ఎటాకింగ్ బౌలింగ్ వేయాలి అనేదే నా ప్రణాళిక. ఇక మొదటి మ్యాచ్ లో శ్రీలంక ఓపెనర్ నిస్సకను క్లీన్ బోల్డ్ చేసిన వికెట్ నాకు ఎంతో ప్రత్యేకం అంటూ శివమ్ మావి చెప్పుకొచ్చాడు.