
ఎక్కడ ఒక చోట ఇలాంటి ఘటనలే కాస్త వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చెడ్డీగ్యాంగ్ సృష్టించిన హల్‌చల్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళల పట్ల కుటుంబ సభ్యులు హింసించడం, వారిని టార్చర్‌కు గురిచేయడంతో వారు మానసికంగా, శారీరకంగా క్రుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇలా కేసుల్లో ఉన్న నిందితులకు కోర్టులు రకరకాల శిక్షలను వేస్తున్నాయి. హ త్యలకు సంబంధించిన కేసులు చాలా కాలం పాటు కోర్టుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసినది. మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితిడుకి శిక్ష వేయవచ్చు అని స్పష్టం చేసింది. మరొకవైపు వేరే సాక్ష్యం అవసరం లేదని, సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసినది. ఓ కేసులో మహిళను ఆమ మామ, బావ కలిసి నిప్పు అంటించి హత్య చేసారు. అయితే ఆమె చనిపోయే ముందు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది దీనీ ఆధారంగా ట్రయల్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే మరణ వాంగ్మూలానికి మద్దతుగా వేరే సాక్ష్యం లేదని.. ట్రయల్ కోర్టు తీర్పును అలహాబాద్ హై కోర్టు కొట్టేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బీ.వీ. నాగరత్నలతో కూడిన సుప్రీం కోర్టు మరణ వాంగ్మూలం నిజం అని, న్యాయస్థానం సంతృప్తి పడినట్టయితే వేరే సాక్ష్యం అందించాల్సిన అవసరం లేదని శిక్ష వేయొచ్చని వెల్లడించింది.