‘వీడెక్కడున్నా రాజేరా..’ అని బాహుబలి2 లో ఓ డైలాగ్ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మ్యానియా చూస్తే ఆ డైలాగ్ పక్కా పర్ఫెక్ట్ అనిపించక మానదు. పవన్ పేరు ఫ్యాన్స్ లో ఎంతటి హోరో, జోరు, హుషారు తెప్పిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. పవన్ తెరపై కనిపించి మూడేళ్లు కావొస్తోంది. 2018 జనవరి 10న వచ్చిన అజ్ఞాతవాసి తర్వాత సినిమా చేయలేదు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. అన్ లాక్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. కానీ.. పవన్ ఎలా ఉన్నాడో ఎవరికీ తెలీలేదు.


కానీ.. పవన్ ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చేలా పవన్ కొత్త ఫొటో బయటకు వచ్చేసింది. దాదాపు నాలుగు నెలలుగా చతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ బాగా జుట్టు, గెడ్డం పెంచి కనిపించాడు. ప్రస్తుతం దీక్ష ముగియడం.. సినిమా షూటింగ్ లో పాల్గొడంతో సినిమా మేకోవర్ లోకి మారిపోయాడు. పవన్ న్యూలుక్ లో ఉన్న పూర్తి ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. తనదైన స్టయిల్లోకి మారిపోయిన పవన్ కల్యాణ్ ఫొటో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. రీసెంట్ గా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన పిక్ లో పవన్ సరిగా కనిపించలేదు.



ఇదే ఫొటోతోపాటు వకీల్ సాబ్ టీజర్ కోసం పవన్ డబ్బింగ్ చెప్తున్న స్టిల్ అంటూ మరో ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన మార్క్ స్టైల్ తో ఉన్న ఆ ఫొటో కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. పవన్ లుక్ తో వచ్చిన మోషన్ టీజర్, పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్ తోపాటు సినీ అభిమానులు వకీల్ సాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లుక్ పై అఫీషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: