
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం కలయికలో తెరకెక్కిన తాజా సినిమా థగ్ లైఫ్. గతంలో కమల్ - మణి కాంబోలో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ మూవీ నాయకుడు సినిమా తర్వాత వస్తోన్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కు ప్రీమియర్ షో ల అనంతరం జస్ట్ ఓకే అని కొందరు .. కొందరు పర్వాలేదంటూ చెపుతున్నారు. ఓవరాల్ గా మిక్స్ డ్ టాకే వినిపిస్తోంది.
ఇక బుకింగ్స్ కూడా అన్ని ఏరియాల్లోనూ ఓ మాదిరి గా ఉన్నాయి. ఇక థగ్ లైఫ్ సినిమా డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ కూడా ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో చర్చకు వస్తోంది. ట్రెండ్ లో అయితే కమల్ గత సినిమా ఇండియన్ 2 ఓపెనింగ్స్ 50 కోట్లని కూడా ఈ థగ్ లైఫ్ సినిమా అందుకునే ఛాన్స్ లేదు అంటున్నారు. బాగా వర్కవుట్ అయితే రు. 50 కోట్లకు మించి రావన్న లెక్కలే ప్రస్తుతానికి ఉన్నాయి. థగ్ లైఫ్ సినిమా కు ఏఆర్ . రెహమాన్ సంగీతం అందించగా శింబు, త్రిష తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు