
ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో బాధపడుతున్నది. కరోనా వలన కలుగుతున్న అనర్ధాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రపంచాన్ని ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు ఇబ్బందులు పెట్టాయి. కానీ, కరోనా లాంటి మొండి వైరస్ ను ఇప్పటి వరకు ప్రపంచం చూడలేదు. దీంతో ప్రపంచ దేశాలు ఈ వైరస్ పై యుద్ధం ప్రకటించాయి. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా యుద్ధం చేయాలి.
ప్రతి ఒక్కరు కూడా దీనిపైనా నడుం బిగించి పోరాటం చేస్తేనే పని జరుగుతుంది తప్పించి ఎవరో ఒకరు పోరాటం చేస్తే కుదరని పని. అయితే, వైరస్ వచ్చాక బాధపడే కంటే రాకముందు కరోనా గురించి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అని అంటున్నారు. ఈ విషయంలో ఇండియా ఆదర్శంగా నిలుస్తున్నది. అదెలా అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.
మాములుగా విదేశాల్లో విష్ చేసే సమయంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇది అక్కడి పద్ధతులు వారి సంస్కృతులను బట్టి ఉంటుంది. అయితే, ఇండియాలో మాత్రం అలా కాదు. విష్ చేయడం అంటే ఇక్కడ రెండు చేతులు జోడించి నమస్కారం పెడతారు. ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం అంటే అవతలి వ్యక్తులకు గౌరవం ఇచ్చినట్టే కదా. అందుకే ఇండియాలో వైరస్ ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ విషయాన్నీ మనవాళ్ళు చెప్పుకుంటే ఉపయోగం ఏముంటుంది. మనవాళ్ళు కాదు, విదేశీయులు చెప్పుకుంటున్నారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు ఈ విషయం గురించి చెప్తూ ట్వీట్ చేయడం విశేషం. ఇండియా గౌరవానికి చిహ్నంగా భావించే నమస్కారం ను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని, ఇది కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. కరోనా వలన ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపుగా 3000 మందికి పైగా మరణించారు. 80వేలమంది వరకు ఈ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.