
ఎందుకంటే ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సొంత బాబాయ్ అయినా ఎందుకో సీబీఐ మెల్లగా అడుగులు వేస్తుంది అంటూ ఇంతకు ముందు ఎందరో విమర్శలు చేశారు. అయితే నేడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ ని ఉద్దేశించి లేఖ రాశాడు. ఇప్పటి వరకు సీబీఐ ఈ కేసును ఎందుకు వేగవంతంగా పూర్తి చేయడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇందులో మరో కీలక వివాదాస్పద విషయం చెప్పడం కొసమెరుపు. ఎలా అయితే పరిటాల హత్యకు కారణం అయిన హంతకులను హత్య చేశారో అదే విధంగా ఈ కేసులోనూ నిందితుల పై కుట్ర జరుగుతోందని లేఖలో రాశారు. ఈ కేసుకు సంబంధించి జైలు బయట మరియు లోపల ఉన్న ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు.
అంతే కాకుండా ఈ హత్య వెనుక కొన్ని మాస్టర్ మైండ్స్ పనిచేశాయని? వాటి గురించి పూర్తిగా తెలియాలంటే ఎంపీ విజయ్ సాయి రెడ్డిని విచారించాలని రఘురామ చెప్పారు. మరి ఈ లేఖలో సీబీఐ కి రాసిన అన్ని విషయాలను వారు పరిగణలోకి తీసుకుని విచారణ చేపడితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది. అంతకన్నా ముందు రఘురామ పై వైసీపీ నాయకులు ఎవరిపైన మాటల దాడి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.