రష్యా ఉక్రెయిన్ యుద్దం ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. పోలండ్ నాటో లో చేరి రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చింది.  పోలండ్ లో ఉన్న  రష్యా రాయబార కార్యాలయంను స్తంభింపజేసింది. ప్రస్తుతం రాయబార కార్యాలయంలో ఉన్న అకౌంట్లను ప్రీజ్ చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్దం జరుగుతున్న సందర్బంగా అమెరికా, యూరప్ దేశాలకు జరిగిన ఒప్పందం ప్రకారం..  రాయబార కార్యాలయంలో ఉన్న అన్ని అకౌంట్లను ప్రీజ్ చేశామని పోలండ్ చెబుతోంది.


రష్యా ఇది వియన్నా ఒప్పందానికి తూట్లు పొడవడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ కు కూడా ఎక్కువగా ఆయుధాలను పోలండ్ సరఫరా చేస్తుంది. ఏదేమైనా అంటే ఆయుధాలు ఇస్తే ఒక వేళ రష్యా పోలండ్ మీదకు యుద్దానికి వస్తే 30 దేశాల మద్దతు కూడా వస్తుందనే ధీమాతో రష్యాను రెచ్చగొడుతోంది. దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందనేది గ్రహించలేకపోతుంది.


ఉక్రెయిన్ నాటో చేరతామని అన్నందుకే పుతిన్ ఆ దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తున్నారు. అలాంటి పుతిన్ తో గిల్లికజ్జాలకు పోలండ్ ఆసక్తి చూపుతోంది. పోలండ్ లోని రష్యా రాయభార కార్యాలయంలో చేసిన పని వల్ల పుతిన్ ప్రభుత్వం చాలా  గుర్రుగా ఉంది. పోలండ్ కు కూడా ఇదే కావాలి. ఒకవేళ పోలండ్ పై  దాడి జరిగితే కచ్చితంగా అన్ని దేశాలు పాల్గొనాల్సిందే. నాటో దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం. నాటో దేశాల్లో ఏ దేశంపైనా యుద్దం వేరే దేశం చేస్తే కలిసి దాన్ని ఓడించాలి.


ఈ ధీమాతో పోలండ్ రష్యా పైనే మాటల దాడి కొనసాగిస్తుంది. పోలండ్ ఇలా రెచ్చగొట్టడం వెనక అమెరికా ఉందనే కారణాలు వినిపిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల కలుగుతున్న ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. మరో పక్క తైవాన్ చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో 30 దేశాలు ఒక వైపు రష్యా ఒకవైపైతే అణ్వస్త్ర దాడి చేయకుండా ఊరుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: