
ఇటీవల నాలుగున్నరేళ్ల కృతం అక్కినేని వారి మూడవతరం వారసుడు నాగ చైతన్యని ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, కొన్నాళ్ల క్రితం పలు కారణాల వలన ఆయన నుండి విడిపోయి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నారు. అయితే విడాకుల అనంతరం కూడా అక్కడక్కడా నాగ చతన్య, సమంతలపై పలు రూమర్లు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా సమంత తో విడాకుల అనంతరం చైతన్య, మరొక యువ కథానాయిక డేటింగ్ లో ఉన్నారు అంటూ ఒక వార్త నిన్నటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తుండడంతో, ఇదంతా కూడా సమంత పిఆర్ టీమ్ పనే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
అయితే ఫైనల్ గా ఈ విషయమై కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందించిన సమంత, ఒక అమ్మాయి గురించి రూమర్లు వస్తే అది ఆల్మోస్ట్ నిజమే, అదే ఒక అబ్బాయి గురించి వస్తే తప్పకుండా దాని వెనుక ఒక అమ్మాయి హస్తం ఉండే ఉంటుంది అంటూ, ఈ విధంగా తప్పుగా తనపై కథనాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారాయని, కావున దయచేసి ఎవరి పనులు వారు చూసుకోండి అంటూ ఆమె సదరు మీడియా సంస్థ వారికీ రిప్లై ఇచ్చారు. కాగా ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.