టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో రష్మిక కూడా ఒకరు. శాండిల్ వుడ్ లో మొదట కిరిక్ పార్టీ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లోకి మాత్రం నాగశౌర్య నటించిన ఛలో చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ ,అల్లు అర్జున్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.

అలాగే అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో పలు ఆల్కహాల్ బ్రాండ్లకు ప్రమోషన్ గా ఉండడమే కాకుండా పలు యాప్స్ కు పలు యాడ్స్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఈ క్రేజీతోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా పలు సినిమాలలో నటించింది. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు పలు విషయాలలో రష్మిక కూడా ట్రోల్ కి గురవుతూ ఉంటుంది.


ఇప్పుడు తాజాగా సెవన్ అప్(7up )అనే బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో సినిమాల విషయానికి వస్తే కేవలం పుష్ప -2 సినిమా తప్ప మరే సినిమాలో కూడా నటించలేదు. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం భారీ గానే పెంచేస్తోంది ఈ ముద్దు గుమ్మ. ఇక  విజయ్ దేవరకొండ తో ప్రేమయరం నడుపుతున్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: