
ఇక పెద్దల సభలో అయితే నాలుగు రోజులుగా అదే పరిస్థితి. ఎంపీల సస్పెన్షన్పై ఈ రోజు కూడా రాజ్యసభలో నిరసనలు కొనసాగాయి. ఇక వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మూడు ప్రైవేటు మెంబర్ బిల్లులను పెద్దల సభలో ప్రవేశపెట్టారు. ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడే వారికి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా చట్టాలు సవరించాలని విజయసాయిరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించినట్లు ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో... ఏపీ నుంచి 11 వేల 939 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయన్నారు. 2020-21 నాటికి ఈ ఎగుమతుల విలువ మరో 5 వేల కోట్లకు పెరిగినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఎగుమతుల్లో ప్రధానంగా ఆక్వా, ఫార్మా, డ్రగ్స్, కెమికల్స్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ఉన్నాయన్నారు. దేశంలో ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే మేజర్ వాటా అని కూడా పెద్దల సభలో కేంద్ర మంత్రి ప్రకటించారు.