
బతికుండగానే చంపేశారు… కోటా గారి వైరల్ కామెంట్స్ ... కోట శ్రీనివాసరావు గతంలో అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు, ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో నకిలీ వార్తలు వైరల్ అయ్యాయి. అప్పుడు కోటా స్వయంగా స్పందిస్తూ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు:
“టైమ్ వచ్చినప్పుడు టైమ్ ఉండదు…”
“బతికుండగానే చంపేశారంతా. నా చావు మీద వార్త రాసి రూపాయి సంపాదిస్తావా?”
“మన ప్రవర్తనే మనకు పని కల్పిస్తుంది… అది బాగుంటే బాగుంటాం…”
ఈ మాటలు ఇప్పుడు సోషల్ మిడియ లో వైరల్ అవుతున్నాయి. జీవితానికి సంబంధించి ఆయన తాత్విక దృక్పథాన్ని ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. కొద్దీ రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ... ఆరోగ్యం అంతగా బాగలేని కోట గారు గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయనకు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అభిమానుల స్పందన: కోట గారి డైలాగ్స్, ఫోటోలు షేర్ చేస్తూ భావోద్వేగం సోషల్ మీడియాలో ఇప్పటికే కోట శ్రీనివాసరావు గారి డైలాగ్స్, సీన్‌లు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్నో తారలు, దర్శకులు, అభిమానులు RIP Kota Garu అంటూ పోస్టులు చేస్తున్నారు.
కోట గారి నటజీవితం: లెజెండ్ కి గౌరవంగా 750+ సినిమాలు , 9 నంది అవార్డులు, పద్మశ్రీ పురస్కారం (2015), విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం .. కోట శ్రీనివాసరావు గారి మరణం – భారత సినీ రంగానికి తీరని లోటు ... “ఒకే పాత్రలో ముగింపు లేదు… కానీ కోట గారి జీవితం మాత్రం ఎవరు మరిచిపోలేరు ”