పండ్లన్నిటికి రారాజు మామిడి పండు అని చెప్పాలి. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది మామిడి పండు. ప్రతి వారి చూపు పండ్లలో రారాజు అయిన మామిడి పండు(Mango Fruit) వైపే ఉంటుంది.కేవలం పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఇక మార్కెట్లోకి మామిడి పండు అనేది వచ్చిందంటే చాలు అందరి చూపు దాని వైపే వుంటుంది. ఇక మామిడి పండు రుచికి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే.అందుకనే 4వేల వేళ్లకు పైగా ప్రసిద్ది చెందిన మామిడి ఫలాన్ని వేదాల్లో 'దేవతల ఫలం' అని కూడా అంటారు. అయితే మామిడి పండులో టెంకె అనేది సర్వసాధారణంగా ఉంటుంది.. కానీ టెంక లేని మామిడి పండు కూడా ఉంటుందని మీరెప్పుడైన ఊహించారా.. అలాంటి మామిడి పండ్లు ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతుంది.ఇక మామిడి పండ్లు గ్లోబల్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న దేశం థాయిలాండ్ అని చెప్పాలి. ఈ దేశం ఎగుమతి చేసే పండ్లలో ఒకటి మామిడి పండ్లు ఒకటి.



ఈ వీడియోలో ఒక అమ్మాయి మామిడి పండ్ల బుట్టల్లో పెట్టి వాటిని రెడీ చేస్తోంది. అయితే ఇక ఒక బుట్టలో నుంచి ఒక మామిడి పండును తీసుకుని దానిని మధ్యలోకి కట్ చేసింది. అందులో టెంక లేదు.. కానీ చూడగానే తినాలని అనిపించేలా ఆ పండు ఉంది. అయితే ఇటువంటి టెంక లేని మామిడిలోని కొత్త రకాన్ని మనదేశంలోని శాస్త్రవేత్తలు కూడా అభివృద్ధి చేశారట. 2014 వ సంవత్సరంలో భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు.అయితే ఇలా అభివృద్ధి పేరుతో ప్రకృతికి విరుద్ధంగా ఇలాంటి పండ్లని పండించడం వల్ల నష్టమే కానీ లాభం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. 'టెంక లేని మామిడి పండు అంటే మెదడు లేని శరీరం' అని కొందరు కామెంట్ చేస్తున్నారు. టెంక లేదు, పోషకాలు లేవు ఇంకా ఆరోగ్యం లేదని మరికొందరు కామెంట్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం మామిడి పండు తినడం కంటే టెంక తింటుంటే వచ్చే మజా వేరని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: