
రామ్ చరణ్, శంకర్ కాంబోలో కొత్త సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. తెలుగులో విడుదలైన శంకర్ చిత్రాలన్నీ అనువాద చిత్రాలే. తెలుగు హీరోతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ స్టార్ డైరెక్టర్. అలాంటిది ఇప్పుడు ఆ అవకాశాన్ని, రికార్డును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకోనున్నారు. రామ్ చరణ్ హీరోగా తొలిసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేయబోతున్నారు శంకర్. కాగా ఈ సినిమా కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ ఎంపికయ్యారు. దాంతో ఆసక్తికర చర్చ ఒకటి తెరపైకి వచ్చింది. సాధారణంగా శంకర్ మూవీ అంటే మ్యూజిక్ కాంబోకు ఏ.ఆర్.రెహమాన్ పేరు ఖరారు అవుతుంది.
అలాంటిది థమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఫైనల్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. దాంతో ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ తన లక్కీ చామ్ రెహమాన్ ను కాదని థమన్ ను సెలెక్ట్ చేయడం వెనుక కారణాలేంటి అన్న చర్చ మొదలైంది. ఏఆర్.రెహమాన్ తో ఉండే కాంప్లికేషన్స్ ఇందుకు కారణమని అభిమానులు అనుకుంటున్నారు. ఒక సినిమాకి మ్యూజిక్ రెడీ చేసేందుకు ఆయన ఎక్కువ సమయం తీసుకుంటారు. అదీ కాక ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. తన కన్వినెన్స్ మేరకే పని చేస్తారు. దానికోసం దర్శక నిర్మాతలు ఎంత కాలం అయినా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాలో దిల్ రాజు బాగమై ఉన్నారు కాబట్టి .. ఇలాంటి వాటికి ఆస్కారం తక్కువే ఉంటుంది...కాబట్టే అన్నిటికీ అనుగుణంగా ఉంటు దర్శక నిర్మాతలకు అనుగుణంగా సంగీతం అందించే థమన్ ను ఫైనల్ చేసినట్లు భావిస్తున్నారు. కానీ రెహమాన్...శంకర్ ల మ్యూజిక్ ..మ్యాజిక్ ని తమన్ అందిచగలడా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి