
భారత్
కు ఇందిరాగాంది మరణం తరవాత అంటే
1984 తరవాత ఒక విప్లవాత్మక నాయకత్వం
లభించలేదు. అంటే 33 సంవత్సరాలు ఈ దేశాన్ని తామత
తంపర నాయకత్వాలే పాలించాయి. మద్యలో పి.వి. నరసింహారావు
ఒక పరిణామాత్మక ప్రభుత్వాన్ని అందించారు. తద్వారా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు.
దేశానికి సరైన మార్గదర్శి గా
నిలిచారు. అయితే ధీటైన నాయకత్వాన్ని అందించటానికి సరైన సంఖ్యాబలం లేక
చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే అటల్ బిహారీ వాజపేయి
కూడా చక్కని విదేశాంగ విధానం అందించినా ముగ్గురు మహిళలా నాయకత్వ పార్టీలు అందించిన సహకారం తో అధికారాన్ని బాలన్స్
చేయలేక చాలా అవస్థలను రుచి
చూశారు. దీంతో ఇందిర అనంతరం అంటే 33 సంవత్సరాల తరవాత మాత్రమే బలమైన నరెంద్ర మోడీ నాయకత్వం లభించింది.
మనకు ఒక సమర్ధుడైన నాయకుడున్నాడు అని మానసిక దన్ను సాధారణ భారతీయ పౌరునికి లభించింది "నమో" నాయకత్వం లోని పాలన మొదలయ్యాకే. భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని స్కాముల స్వామ్యంగా మార్చిన "కాంగ్రేస్ ముక్త భారత్" భారత జాతి సంపూర్ణంగా ముక్త కంఠంతో అభినదించబట్టే బాజపాకు అపూర్వమైన ఆధిఖ్యత లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ పరిణామ క్రమంలో బాజపా మే 2014 తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో అనేక రాజకీయ వ్యుహాలను రచించి సామ దాన, భేదాలను ప్రయోగించి మహరాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్, గోవా లాంటి ప్రధాన రాష్ట్రాలను తన ఖాతాలో వేసేసుకుంది.
ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో అతిపెద్ద సమస్య, ప్రజల ప్రయోజనాల కంటే, వ్యక్తిగత రాజకీయ స్వార్థ ప్రయోజనాలకే నాయకులు ప్రాధాన్యత ఇస్తుండటం! బీహార్ లో జరిగింది ఇదే. ఆర్జేడీతో బంధం తెంచుకుని, 24 గంటలు గడవక ముందే నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేశారు. ఈ పరిణామాలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
బీహార్ ప్రజలను నితీష్ కుమార్ నిలువునా మోసం చేశారని విమర్శించారు. మత తత్వ శక్తులకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తారన్న నమ్మకంతో నితీష్ కు ప్రజలు గెలిపిస్తే, తన రాజకీయ ప్రయోజనం కోసం ఇవాళ్ల నితీష్ అలాంటివారితోనే చేతులు కలుపుతున్నారు అన్నారు. నితీష్ ప్లానింగ్ అంతా గడచిన నాలుగైదు నెలలుగా తెలుస్తూనే ఉందనీ, ఇప్పుడు సమయం చూసుకుని గోడ దూకేశారన్నారు.
‘భారత దేశ రాజకీయాల్లో ఇదే అసలు సమస్య, వ్యక్తిగత స్వార్థం కోసం ఏదైనా చేసే వెసులుబాటు ఉంది. ఎలాంటి నియమాలూ, విలువలూ, విశ్వసనీయతా అనేవి లేకుండా పోతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే, రాహుల్ గాంధి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గా మాట్లాడిన్న తొలి పరిపక్వత తో కూడిన మాటలివి. కాని వ్యక్తిగత స్వార్ధం, విశ్వసనీయతా లోపం వారి కాంగ్రెస్ పార్టీనే గత 132 యేళ్ళుగా భారత దేశం లోని రాజకీయపార్టీలకు ప్రజలకు నూరి పోసింది. ఆ యదార్ధం మాత్రం తెలియని అపరిపక్వత ఆయనది.
ప్రారంభం నుండి ఎంతో కొంత లేదా కొంత లో కొంత కాంగ్రెస్ వాసనలు లేని ప్రజాస్వామ్య పార్టీ దేశములో ఏదో ఉందీ అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమె. అందుకే కమ్యూనిస్టులను నమ్మలేక వారి చైనా అభిమాన భావనతో వారి దేశభక్తిని కూడా అనుమానాస్పదంగా చూసే భారత జనవాహిని బాజపాను దిగ్విజయంగా అధికారం లోకి తెచ్చారు. ఇక్కడ ప్రధాని నరెంద్ర మోడీ ఒక మార్గదర్శిగా కనిపించటమే కారణం. "నేనున్నాను" అనేది ఎంతో బలాన్ని ఇచ్చే భావన. దాన్ని ఆయన ప్రజల్లో పాదుగొలిపేలా చేశారు. అదీ ఆయన విజయ రహస్యం. బాజపా విజయ రహస్యం కూడా ఆయన సారధ్యమే. దాదాపు మూడేళ్ళ పాలనలో స్కాముల గోల లేక పోవటం జన హృదయాలను కొంత అవినీతి భార విముక్తి కలిగించటం కూడా బాజపాకి అనుకూలతను సాధించి పెట్టింది.
ఒక ధారుణ విఫల ప్రయోగం "పెద్ద నోట్ల రద్దు" కూడా మోడీ ఉన్నాడులే అనేభావనతో అతిసునాయాసంగా వదిలేసింది భారత జనవాహిని. అంతే కాదు "జిఎస్టి" తో భారత ప్రజాస్వామ్య "ఫెడరల్ స్పూర్తి" కి విఘాతం కలిగినా ప్రజలు లక్ష్య పెట్టక మోడీ నాయకత్వం లోని బాజపా సహిత ఎన్.డి.ఏ ని కూడా సహిస్తూనే ఉన్నారు. ఇదంతా గత 130 యేళ్ళ పాపాలతో కాంగ్రేస్ బాజపాకు కట్టబెట్టిన విజయం. కనీసం ప్రతిపక్షం ఉంది దానికి ఒక నాయకుడున్నాడు అనేది కూడా జనానికి తెలియనంతగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. దాదాపు అన్నీ రాష్ట్రాలు బాజపా తో సంకీర్ణమో సొంతమో అయిపోయాయి. "కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ" ఈ నాలుగు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ఉనికి ఉంది. దాదాపు కాంగ్రేస్ ముక్త భారత్ వైపు బాజపా కోరుకున్నట్లు పయనిస్తుంది ఈ దేశం. ప్రతిపక్ష రాజకీయ నాయకులు బీజేపీకి వరుస వారీగా తమ విధేయత ప్రకటిస్తున్నారు. ఒక సార్వం సహా సార్వభౌమునిముందు సామంత రాజుల్లా.
బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా. కారణం నెహ్రూ గాంధి వాసనలతో కంపుకొట్టే కాంగ్రెస్ ఇంకా అధికారం లోకి రాలేదనేలా నీరసించి పోవటం దిశా నిర్దేశం యివ్వలేని దాని నాయకత్వం ఆ పార్టీని చెత్తబుట్టలో తానే వేస్తున్న స్థితి. ఇక ఇప్పటికైనా ధీటైన నాయకత్వం వహించేవారికి పార్టీ పగ్గాలు అప్పగించకపోతే 2019 నాటికి కాంగ్రేస్ అనే పార్టీ ఒకటి ఉండేది అని మనం మనతరమే చదువుకోవలసి వస్తుంది. ఎన్నో ఆశలతో, ఆశయాలతో 1985 డిసెంబర్ 28 న ఆలెన్ ఆక్టావియా హ్యూం, దాదాబాయ్ నౌరోజీ, దిన్షా ఎడుల్జీ వాత్సా వ్యవస్థాపకులుగా స్థాపించిన జాతీయ కాంగ్రేస్ చివరకు రాహుల్ గాంధి అనే ఒక అనామకుని చేతిలో పడి నిర్వీర్యమవటం జాతికి పట్టిన దుర్దశ. కాంగ్రెస్ లాంటి భారత్ కు స్వాతంత్ర సమూపార్జన చేసిన చారిత్రాత్మక మహోన్నత చరిత్ర కలిగిన పార్టీ పతనంలో కూడా కనీస గౌరవానికి నోచుకోలేక పోతుంది.
ప్రధాని నరేంద్రమోదీకి దీటైన ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగంలో నిలిచి 2019 ఎన్నికలలో పోరాటం చేస్తారని అనుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆర్‌జేడీ నేత లాలూప్రసాద్‌తో తెగ తెంపులు చేసుకొని మహాఘటబంధన్ నుంచి నిష్క్రమించి ఎన్‌డీఏ శిబిరంలోకి అత్యంత చాకచక్యంగా బాజపాలోకి చేరిపోయారు అదీ కాంగ్రేస్ నేర్పిన పద్దతిలోనే దారితప్పి తిరిగి తిరిగి చేడి మనసుమార్చుకొని స్వగృహానికి తిరిగొచ్చిన కొడుకులా.. నిర్మించే క్రమంలో దేశంలోనే మూడవ అతిపెద్ద రాష్ట్రం బీహార్ ను బాజపా నితీష్ సహాయంతో అతిసునాయాసంగా హరించివేసింది. ఇది సోనియా రాహుల్ గాంధిల సంయుక్త అసమర్ధతకు చిహ్నం.
“కాంగ్రెస్ ముక్త్ భారత్” ను నిర్మిస్తానంటూ నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రతిజ్ఞను సాధించే క్రమంలో బాజపా దాని లక్ష్యం చేరే దారిలో అతిపెద్ద సోపానం ఎక్కేసినట్లే. ఇందుకు జాతీయ మీడియా ప్రశంస లు మిన్నంటాయి కూడా! ఇంతే కాదు అదే మీడియా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తన పార్టీ నుంచి బీజేపీకి వలసలు ఆపలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టా డుతున్నట్టు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చాకచక్యాన్నీ, చాణక్యాన్నీ, చమత్కారాన్నీ మనస్ఫూర్తిగా అభి నందిస్తున్నాయి.
అయితే ఈ అప్రతిహత అధికార పరిగ్రహణాన్ని ప్రజాస్వామ్య విజయం గా భావించినా నైతికంగా ఇది బాజపా విజయమందామా? అలా ఐతే కాంగ్రెస్ 132 రెండెళ్ళ పాలనకు గుణపాఠం చెప్పామని ప్రజలనుకున్నా - అలాంటి తప్పులే బాజపా చేస్తూపోతే మరోసారి "అత్యాయక స్థితి లేదా అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీ" భారత్ వాకిట్లోకి రాదన్న గ్యారంటీ లేదనిపిస్తుంది. ఈ అధికార దురహంకారం తలకెక్కక పోతే నరెంద్ర మోడీ అలా చేయక పోవచ్చు.
ఇక ఎన్.డి.ఏ. అంతర్గత మిత్ర పక్షాలను వదిలేస్తే బహిర్వలయ మిత్రపక్షమయిన తెలంగ్గాణా రాష్ట్ర సమితి, అన్నా-డిఎంకె దాదాపు బ్రష్టు బట్టి పోయినట్లే. శతృపక్షాలైన బిజు జనతాదళ్, తృణమూల్ లాంటి పార్టీల పయనం అంత మంచిగాలేదు. మమత బెనర్జీ అహంకారం ఆమె పార్టీ ‘టిఎంసి’ ని తుద ముట్టించేలా ఉంది. ఈ పరిస్థితుల్లో బాజపా దిగ్విజయం అద్భుతంగా దేశాన్ని ముందుకు నడిపించవచ్చు.
మున్నెన్నడూ లేని ఇంత ఐఖ్యతతో ‘నమో నాయకత్వం’ ప్రజలకు సుధీర్ఘ భవిష్యత్ కోసం మేలైన ప్రయోజనాలు సిద్ధించే దశగా నిర్ణయాలు తీసుకునేందుకు తగిన ప్రజాబలం లభించినట్లే. భారత్ ను దాని సరిహద్దులను బలోపేతం చేయవచ్చు. శత్రుదేశాలు మనదేశం వైపు చూసే సాహసం చేయాలంటే దడ పుట్టేలా చేసే అవకాశాలు బాజపా స్వంతమవుతాయి. కాశ్మీర్ సమస్యకు శాశ్విత పరిష్కారం, పాకిస్థాన్ కు పరాజయం ఒకేసారి కలిగించవచ్చు. మనచుట్టూ ఉన్న “చైనా పాకిస్థానేతర” చిన్న చిన్న దేశాలకు సహకారం అందిస్తే మనమూ అవీ సుభిక్షం సాధించవచ్చు.
అయితే అధికారరంధిలో పడి బాజపా రాజకీయ నాయకులు కూడా అనైతిక విన్యా సాలు చేయకుండా ఉంటారా? అలా జరిగితే మోడీ ఇంకొన్ని దశాబ్ధాలు “భారత ఉపఖండం” ను అజేయం గా విశ్వం వాకిట్లో నిలపొచ్చు. అయితే సామాన్య ప్రజలకు చేరువ కాలేకపోతే మాత్రం ఈ బాజపా పయనం పతనాల లోయల్లోకే అనే పాఠం మోడీ నాయకత్వ బాజపా తెలుసుకొని వ్యవహరించటం అవసరం. సామాన్య మానవులు ఎట్లా పరిగణిస్తున్నారు? ఏ తీరానికి ఈ బాజపా మహా ప్రస్థానం? అయితే అది అంత సులభమా? ఈ కుతంత్ర కుశ్చిత రాజకీయ వైకుంటపాళిలో విలువల వలువలు ఊడదీస్తూన్న ప్రస్తుత బాజపా రాజకీయాల్లో మార్పు వస్తుందా? అనేదే పెద్ద ప్రశ్న?