లోకేష్ వర్సెస్ వైసీపీ పార్టీ. తాజాగా వైసిపి పార్టీకి ఒక వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఏమని అంటే న్యాయపోరాటం చేస్తా మీ మీద కేసు వేస్తాను అన్నటువంటి అంశాన్ని తీసుకువచ్చారు. ఎందుకయ్యా అంటే ఏదైతే తల్లికి వందనం కింద 15 వేల రూపాయలని 13 వేల రూపాయలు డబ్బులు ఇచ్చారని.. తల్లికి వందనం డబ్బులు 2000 రూపాయలను లోకేష్ జేబులోకి వెళ్ళిపోతున్నాయనే విధంగా సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ ద్వారా విమర్శించింది  కాబట్టి వాటి మీదన వెళ్తాను అంటూ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.



లేకపోతే మీరు క్షమాపణలు చెప్పాలి.. లేకపోతే సాక్ష్యాలు చూపెడతారా? న్యాయపోరాటం చేస్తాను అంటూ నారా లోకి తెలిపారు.. వీటికి ఆంబాటి రాంబాబు ఒక సమాధానం చెబుతూ.. మరి ఇదివరకు 2000 రూపాయలు అప్పుడు మేము కూడా ఇదే కాన్సెప్టులో తగ్గిస్తే.. దానిని తీసుకువెళ్లి మీరు తాడేపల్లి బ్యాలెన్స్ కి పోతున్నాయని అన్నారు కదా.. ఇప్పుడు మేము కూడా అలాగే మీ జోబులోకి అనగానే ఎట్లా అన్నటువంటిది?  ప్రశ్నించామంటూ అంబాటి రాంబాబు ప్రశ్నించారు. లేదు నేను న్యాయపోరాటమే చేస్తాను మీ సంగతే తేలుస్తానంటూ నారా లోకేష్ తెలియజేస్తున్నారు.


రాబోయే రోజుల్లో దీనిమీద కేసు వేయడానికి పరువు నష్టం దావవేయడానికి తరహాలో చేస్తున్నారనే విధంగా లోకేష్ హెచ్చరించారు. గతంలో కూడా విశాఖపట్నంలో తాను తిన్నటువంటి దానికి కాదు, తాను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైనా ఖర్చుల్ని సాధారణంగా లోకేష్ ఖర్చులోని రాశారు.. దానిపైన కూడా వేస్తాను.. లోకేష్ ఇన్ని లక్షలు తినేశారు, అన్ని లక్షలు తినేశారు అంటూ రాశారని.. దానిమీద అప్పటినుంచి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాను.. కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి నారా లోకేష్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారంటూ తెలియజేశారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందనే విషయం తెలియాలి మరి. ఈ విషయం పైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: