
అంశాలవారీగా వివరాలు వెల్లడించిన హరీశ్ రావు.. బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. ఆయన ఏమన్నారంటే.. “ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది.. ఎనీ టైం మీటర్ అని చెప్పే బీజేపీకి ఎనీ టైం వాటర్ ఇచ్చే కాళేశ్వరం గురించి అర్థం కాదు.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా గురించి ఎందుకు తేల్చలేదు.. ఆరు నెలల నుంచి ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ ఆపింది.. బియ్యం సేకరణ ఎందుకు ఆపారో చెప్పాలి.. విదేశాల్లో దాచిన నల్లధనం వెలికితీసుకురావడంలో కేంద్రం వైఫల్యం చెందింది.. పేదల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని గుర్తు చేశారు.
" ప్రధాని ప్రసంగంలో కూడా అబద్ధాలే చెప్పారు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ 26 లక్షల కుటుంబాలకే వర్తిస్తుంది.. ఆరోగ్యశ్రీ మాత్రం 86 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది.. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైన పథకం.. 8 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకురావట్లేదు.. రూ.1050 సిలిండర్ ధరను తగ్గిస్తామని ఎందుకు చెప్పలేదు.. గతంలో ఇచ్చిన రూ.400 సబ్సిడీ ఇస్తామని ప్రధాని చెప్పారని మహిళలు ఆశించారు.. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు.. నిన్న ప్రధాని జాతీయ హోదా ప్రకటన చేస్తారని అనుకున్నాన్నారు హరీశ్ రావు.
" తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్.. తలసరి ఆదాయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2లక్షల 78వేలు.. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న యూపీలో తలసరి ఆదాయం రూ.71 వేలే .. సంపద పెరిగింది కాబట్టే పెన్షన్ రూ.200 నుంచి రూ.2వేలకు పెంచాం.. నిధులు దక్కినందువల్లే సాగుకు కాళేశ్వరం...తాగుకు మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నాం.. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులిస్తే మరింత అభివృద్ధి జరిగేదని హరీశ్ రావు అన్నారు.