జాతీయ పార్టీ బిజెపి లో మరో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది... ఈ విషయంలో ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫుల్ గా ఫైర్ అయినట్లు సమాచారం.. ఇంతకీ అసలేం జరిగిందంటే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయిన జీవీఎల్ నరసింహరావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి చీవాట్లు వర్షం కురిసిందట. జేపీ నడ్డా ఓ విషయంపై జీవీఎల్ నరసింహారావు పై మండిపడ్డారని తెలుస్తోంది. ఇంతకీ ఆ విషయం ఏమిటో కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో పంట నష్టాలు వ్యవసాయ రంగానికి సంబంధించి సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలాతో వైసీపీ నేతలు ఏపీ వ్యవసాయ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించి జీవీఎల్ రెడీ అయ్యారట. కాకపోతే వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో వీడియో కాన్ఫరెన్సు గురించి ఏపీకి చెందిన మిగతా బీజేపీ ఎంపీలకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సంగతి మంత్రి పురుషోత్తం రూపాలా ద్వారా తెలుసుకున్న ఎంపీ సీఎం రమేశ్ నేరుగా విషయాన్ని జేపీ నడ్డాకు చెప్పడంతో ... ఈ విషయం విన్న నడ్డా జీవీఎల్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. అసలు పార్టీ కి తెలియకుండా ఇలా ఎలా చేస్తారని ఫైర్ అయ్యారట.

ఈ విషయంపై సొంత పార్టీలోని కొందరు సభ్యులే జీవీఎల్ పై అసంతృప్తి భావం వ్యక్తం చేయగా విషయం మరికాస్త వేడెక్కింది. మరోవైపు ఆయన బీజేపీ ఎంపీలా కాకుండా వైసీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్న కామెంట్ సొంత పార్టీలో వారే అంటున్నట్లు వినిపిస్తోంది. తాజా ఘటనతో ఎంపీల నుంచి వచ్చిన ఫిర్యాదు అనంతరం బీజేపీ అధిష్ఠానం జీవీఎల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు జీవీఎల్ ఈ విషయాన్ని ఎలా సర్ది చెప్తారు... తిరిగి ఎలా జేపీ నడ్డాకు దగ్గరవుతారు అన్న సంగతి రాజకీయరంగంలో హాట్ టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: