వాతావరణంలోని పొల్యూషన్, మనం తీసుకునే ఆహారం వల్ల, చర్మం ముఖంపై మృత కణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్లు, కెమికల్ క్రీమ్స్ వాడిన ఉపయోగం లేక విసిగిపోతుంటారు. కానీ మన ఇంట్లో దొరికే బియ్యం పిండితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల, అందులోని కార్బోహైడ్రేట్స్ ముతకణాలను తొలగించడంలో సహాయపడతాయి.మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.అలాంటి బియ్యం పిండితో ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

 ప్యాక్ 1:
ఈ ప్యాక్ కోసం రెండు స్పూన్ల బియ్యం ముందు రోజు నానబెట్టుకొని, ఉదయాన్నే గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తర్వాత, మెల్లగా మర్దన చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనితో ముఖంపై మృతకణాలు,ట్యాన్ తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ప్యాక్ 2 :
ఈ ప్యాక్ పొడిచర్మం కలవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం రెండు స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ కలబంద గుజ్జు, ఒక స్ఫూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసి అరగంట ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల, మృతకణాలు తొందరగా తొలగిపోతాయి. ఇందులో కలబందగుజ్జు వాడటం వల్ల చర్మం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. అంతేకాక మొటిమలు,మచ్చలకు కూడా ఉపశమనం కలుగుతుంది.

ప్యాక్ 3:
ఈ ప్యాక్ జిడ్డుచర్మం కలవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం రెండు స్పూన్ల బియ్యం పిండి, రెండు స్పూన్ల టమాటా గుజ్జు, ఒక స్పూన్ శెనగపిండి  కలిపి ఆ మిశ్రమాన్ని మృతకణాలున్న ప్రతి చోట అప్లై చేయాలి. ఇది బాగా ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి. దీనితో చర్మం మీద రంధ్రాలు బాగా ఓపెన్ అయి మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాక చర్మంపై కల మలినాలను కూడా తొలగించడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: