యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆదిపురుష్'.  సినిమా మొదటిసారి డార్లింగ్ ప్రభాస్ 3-డీ లో నటిస్తున్న 'ఆదిపురుష్' మీద ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాని టీ - సిరీస్ భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయం అనే థీమ్ తో 'ఆదిపురుష్' రూపొందబోతుంది.

ఇక ఈ సినిమాలో 'లంకేష్' గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. ప్రస్తుతం లీడ్ క్యాస్టింగ్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న ఓం రౌత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారని తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రెహమాన్, ఓం రౌత్ మద్యన కథా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే ప్రభాస్ ఒకేసారి నటిస్తున్న రెండు భారీ సినిమాలకి రెహమాన్ సంగీతమందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమాకి కూడా రెహమాన్ సంగీతమనించబోతున్నట్టు సమాచారం.

ఇక 2021 ప్రారంభంలో 'ఆదిపురుష్' ని సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ఓం రౌత్ ప్లాన్స్ చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక 3 డీ ఫార్మాట్ లో విజువల్ వండర్ లా రూపొందనున్న 'ఆదిపురుష్' సినిమా మొత్తం హాలీవుడ్ తరహాలో చిత్రీకరణ చేయబోతున్నారట. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ ఎంతో వర్క్స్ కీలకం కావడంతో ఎక్కువశాతం షూటింగ్ స్టూడియోలో గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ లో కూడా ఎక్కువ భాగం వీఎఫ్ఎక్స్ కే ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ని 'ఆదిపురుష్' కోసం ఎంచుకుంటున్నారట. ప్రభాస్ నటించిన బాహుబలి ఫ్రాంఛైజీ లో కొన్ని కీలక సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇదే గనక జరిగితే వెండితెర మీద వీక్షకులకి 'ఆదిపురుష్' అద్భుతంలా అనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: