తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, నటుడు ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఇందులో శివాత్మిక రాజశేఖర్ రాహుల్ సింప్లిగంజ్ అనసూయ భరద్వాజ్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఇళయరాజా అందించారు. ఈ రోజున ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో యాంకర్ అనసూయ పాల్గొని ఎమోషనల్ అవ్వడం జరుగుతోంది.ఇలాంటి వేదికలపై ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా మాట్లాడే అనసూయ ఈసారి మాత్రం కన్నీరు పెట్టుకుంది. రంగమార్తాండ ప్రెస్ మీట్ లో పాల్గొన్నా అనసూయ డైరెక్టర్ కృష్ణవంశీ వైపు తిరుగుతూ రెండు చేతులు జోడించి మరి నమస్కారం పెట్టి భాగోద్వేగానికి లోనయ్యింది. అనంతరం అనసూయ మాట్లాడుతూ నాకు చాలా ఎమోషనల్  అయింది .మళ్లీ నటిస్తున్నానని అనుకుంటారు.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ బాగా వేగంతో వచ్చిన కన్నీళ్లు తన గొంతు కూడా వణుకుతూనే ఉంది అంటూ మాట్లాడడం జరిగింది అనసూయ.


రంగమార్తాండ అనే సినిమాలో నేను ఉన్నాను అది నా జీవితానికి ఇది చాలు నిన్న రాత్రి నేను ఈ సినిమాను మొదటిసారి చూడడం జరిగింది.నా డబ్బింగ్ వరకు మాత్రమే సినిమా గురించి నాకు తెలుసు.. సినిమా మొత్తం ఎప్పుడూ చూద్దామని చాలా ఆత్రుతగా ఎదురు చూశాను ఊళ్లో లేకపోవడం వల్ల ఇప్పటివరకు చూడలేదు. నిన్నటి రోజున ఈ సినిమాను చూశాను ఈ సినిమాలో అలాగే ఉండిపోయాను ఇది నట సామ్రాట్ అని సినిమా దానిలో ఆల్రెడీ ఏడ్చేశాను మళ్లీ ఏడుపొస్తోంది.. అంటూ తెలియజేస్తోంది అనసూయ. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఇలా రంగమార్తాండ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది అంటూ.. తెరమీద బయట రంగమార్తాండ టీం తో కలిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలుపుతోంది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: