గతంలో తనను అరెస్టు చేసినప్పుడు తనను హింసించారని కొన్నాళ్లుగా చెప్పుకొస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. దీనిపై దర్యాప్తు జరగాలని కోరుకోవడం జరిగింది ఆయన. అయితే రఘురామ కృష్ణంరాజు కోరిక నెరవేరేలా కనపడటం లేదని అంటున్నారు. తనను హింసించిన టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు సిఐడికి అందాయని ఆయన చెప్తున్నారు. ఇది తేలాలంటే అప్పటి సి ఐ డి ఆఫీసర్ల కాల్ డేటాలను సేకరించాలని, అందుకోసం దీనిపై సిబిఐ దర్యాప్తు జరగాలని ఆయన కోరినట్లుగా తెలుస్తుంది.


దీనికి సంబంధించి సిఐడి అధికారుల 2 సంవత్సరాల కాల్ డేటా ఉంటుందని చెప్పకొచ్చారు. ఈ కాల్ డేటా విషయంలో చిన్న ట్విస్ట్ అయితే ఉందని అంటున్నారు. అదేంటంటే అంబటి రాంబాబు ఇంకా అప్పిరెడ్డి వీళ్లిద్దరూ సిఐడి కార్యాలయం దగ్గరలోనే  అప్పుడు ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి పార్టీ ఆఫీసు నుండి వీళ్లకు కాల్ వస్తే వీళ్ళు వెళ్లి సిఐడి వాళ్లకి సమాచారం ఇచ్చేవారట.  అది కూడా ఫోన్ల ద్వారానే సమాచారం ఇచ్చే వారిని  అంటున్నారు.


వాళ్లు సిఐడి కార్యాలయం దగ్గరలోనే ఉంటే మళ్ళీ ఫోన్లు చేయవలసిన అవసరం ఏముంది అని అడుగుతున్నారు మరికొంతమంది. అయితే రెండు సంవత్సరాల కాల్ డేటా  ప్రభుత్వ అధికారుల దగ్గర, ఇంకా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఉంటాయని అంటున్నారు. అది దర్యాప్తు చేయమని సిబిఐ వాళ్ళని ఆదేశిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం తరపున వాదనల్లో, వాళ్లు దానిపై ఒక క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.


సిబిఐ తరపు న్యాయవాది హరినాథ్ మాట్లాడుతూ గతంలో టెలికాం సంస్థలు ప్రాథమికంగా ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం కాల్ రికార్డ్స్ మాత్రమే భద్రపరిచే వారిని అన్నారు. అయితే దీన్ని మారుస్తూ రెండేళ్లకి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను భద్రపరచాలని 2021 డిసెంబర్ నుండి కొత్త రూల్స్ వచ్చాయని అంటున్నారు. కాబట్టి ఆ కాల్ రికార్డ్స్ డేటా లభ్యమవ్వదని అంటున్నారు. రఘురామకి ఇది  గట్టి షాకే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: