భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది టీం ఇండియా జట్టు. ఇక అందరూ అనుకున్నట్టుగానే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇటీవల వన్డే సిరీస్ కూడా మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంకడే  స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో మరోసారి టీమిండియా సత్తా చాటింది. ముఖ్యంగా భారత బౌలర్లు చెలరేగిపోయారు అని చెప్పాలి. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లందరూ కూడా చేతులెత్తేశారు. దీంతో ఇక 188 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి



 ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్  మార్ష్ మినహా మిగతా బ్యాట్స్మెన్ లందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ షమీ చెరో మూడు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు అని చెప్పాలి. ఇక మరోవైపు రవీంద్ర జడేజా,  కుల్దీప్ యాదవ్, హార్థిక్ తల ఒక వికెట్ తీసుకున్నారు. అయితే ఇలా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో కేవలం బౌలర్లు మాత్రమే కాదు ఫీల్డర్లు కూడా ఎలాంటి తప్పిదం చేయకుండా అద్భుతమైన క్యాచ్ లను ఒడిసిపెట్టి అదరగొట్టారు అని చెప్పాలి.


 ముఖ్యంగా గత కొంతకాలం నుంచి బ్యాటింగ్లో అదరగొడుతున్న శుభమన్ గిల్ ఇక మొదటి వన్డే మ్యాచ్ లో ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటాడు. స్లిప్ లో సంచలన క్యాష్ లతో అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఇక మొదటి వన్డే మ్యాచ్ లో రెండు అద్భుతమైన క్యాచ్ లను అందుకున్నాడు శుభమన్ గిల్. అయితే ఈ మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్ లో గిల్ కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు అని చెప్పాలి. స్లీప్ లో క్యాచ్ లను ఎలా అందుకోవాలి అన్న మెలకువలను నేర్పించాడు. ఇకపోతే మొదటి వన్డే మ్యాచ్లో ఇక ద్రావిడ్ ప్లాన్ సక్సెస్ అయింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే అతను చెప్పిన సూచనలను ఫాలో అయిన శుభమన్ గిల్ స్లీప్ లో మెరవడంతో ద్రవిడ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లు అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: