
సూర్య కుమార్ బ్యాట్టింగ్ చేస్తుంటే ఫీల్డర్స్ ని ఎలా సెట్ చేయాలో కూడా అవతల జట్టు కెప్టెన్ కి అర్ధం కాకుండా తికమక పడిపోతారు. ఎబి డివిలియర్స్ కి డూప్ లా మారిపోయి తల బద్దలు కొట్టుకునేలా చేయడం లో అతడికి అతడే సాటి. అందుకే సూర్య కుమార్ యాదవ్ ని ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అంటూ పిలుచుకుంటున్నారు.
ఇక ఇప్పుడు వచ్చే ఐపీల్ సీజన్ మరి కొన్న రోజుల్లో మొదలువుతుండగా. తన బ్యాట్ తో సత్త చాటడానికి సూర్య కుమార్ యాదవ్ సిద్ధం అవుతుండగా, ఈ సారి సూర్య మాత్రమే కాదు స్టేడియం నలుమూలల బ్యాట్ తో బాల్ ని కొట్టి పరుగులు రాబట్టగల మరొక క్రికెటర్ కూడా ఉన్నాడు. అతడు కూడా సూర్య లాగానే మరొక మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అతడు మరెవరో కాదు సం రైజర్స్ టీమ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిపాఠి. t20 ల్లో ఈ ఏడాది కొత్తగా అరంగేట్రం చేసిన రాహుల్ సైతం కవర్ డ్రైవ్, అప్పర్ కట్, స్వీప్, స్ట్రెయిట్, స్కూప్ వంటి షాట్స్ ని బాగా ఆడుతున్నాడు. ఈక్రమం లో సూర్య కుమార్ భారీ షాట్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు కానీ రాహుల్ త్రిపాఠి స్ట్రైక్ రొటేట్ చేయడం లో కూడా సిద్ధహస్తుడు.