ఇమ్రాన్ ఖాన్ ను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం, పోలీసులు, జ్యూడీషియరీ అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారు. వరసగా కేసులు పెడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇళ్లును పోలీసులు ధ్వంసం చేశారు. ఒక పక్క ఇమ్రాన్ మద్దతుదారులు పోలీసుల మీద దాడులు చేయడం, పంజాబ్ పోలీసులు లాహోర్ పోలీసుల మీద దాడులు చేయడం, ఒక్కటేమిటి పాకిస్థాన్ రణరంగాన్ని తలపిస్తోంది. సివిల్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.


ఇలాంటి సమయంలో పాకిస్థాన్ లోని తెహ్రీక్ -ఇ- తాలిబాన్ సంస్థ, బెలూచి రెబల్స్, సింధూ రెబల్స్ ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. వీరందరితో కలిపి దేశాన్ని ముక్కలు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ కుట్రలు చేస్తున్నారని పాక్ ప్రధాని ఆరోపిస్తున్నారు. అమెరికా వాళ్లు కూడా ఇదే అనుమానిస్తున్నారు. షాబాద్ షరీప్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను చంపేస్తుందని కూడా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ బతికుంటే పాక్ ను ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తునట్లు పక్కా సమాచారం ఉంది.


సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులతో ఇమ్రాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వారిని అడ్డు పెట్టుకునే పాకిస్థాన్ ను ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది.  తాజాగా సైన్యాన్ని కూడా అక్కడి పోలీసుల ద్వారానే కంట్రోల్ చేశాడని తెలుస్తోంది. ఇలా ఒక్కరేమిటి చాలా మంది ఇమ్రాన్ కు కూడా సహకరిస్తున్నారు. ఇలా చేస్తే మరో బంగ్లాదేశ్ లాగా పాక్ ముక్కలు కావడం ఖాయం. దీన్ని కాకుండా ఆపాలని పాక్ ప్రధాని ప్రయత్నిస్తున్నారు. మరి


ఇమ్రాన్ ఖాన్ పన్నాగం సక్సెస్ అయితే పాక్ లో మరో దేశం పుట్టుకురావడం ఖాయం. కానీ పాకిస్థాన్ సైన్యం ఎలాగో చాలా బలవంతమైంది. దీన్ని కాకుండా ఆపాలంటే సైన్యం తన చేతుల్లోకి తీసుకుంటేనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇమ్రాన్  ఖాన్ వర్సెస్ పాకిస్థాన్ ప్రధాని అన్నట్లు సాగుతున్న ఈ సమరంలో ఏం జరుగుతుందో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: