సమాజంలో మనుషులను ప్రభావితం చేసే భావోద్వేగాలను గిల్లి మరీ  సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులు రామ్ గోపాల్ వర్మ. ఇటువంటి నేపథ్యంలో ఆర్జివి “పవర్ స్టార్” అనే టైటిల్ పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో పవన్ ఫ్యాన్స్ అసలు ఆ సినిమా గురించి ఎవరూ  పట్టించుకోకూడదు అని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేశారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఏదో రీతిలో పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టి   సినిమాకి మంచి హైప్  తీసుకు రావాలని మొదటిలో సినిమాకి సంబంధించి పిక్స్ పవన్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా విడుదల చేయడం జరిగింది. అయినా గాని పవన్ ఫ్యాన్స్ నుండి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. కానీ ఎప్పుడైతే సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారో… మెల్లమెల్లగా అగ్గి రాచుకుంది.

 

"పవర్ స్టార్" ట్రైలర్ లో పవన్ ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉండటంతో రాంగోపాల్ వర్మని టార్గెట్ చేసుకుని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భయంకరంగా విమర్శలు చేయటం ప్రారంభించారు. ఇదే రీతిలో వర్మ కూడా సినిమాకి సంబంధించి పాల్గొనే ఇంటర్వ్యూలలో పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరేం చేస్తారో చూస్తాను? నా ఆఫీస్ గూగుల్ లో కూడా ఉంటుంది అంటూ సవాల్ చేశాడు. 
 
దీంతో గురువారం జులై 23 వ తారీకు సాయంత్రం ఓయూ నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున డైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ లోకి వెళ్లి హడావిడి సృష్టించడంతో ఆఫీసు సిబ్బంది పోలీస్ కేసు పెట్టడంతో కొంతమంది పవన్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మీడియాలో ఈ వార్త హైలెట్ అయ్యింది. గురువారం సాయంత్రం తెలుగు మీడియా మొత్తం ఈ గొడవనే కవరేజ్ చేసింది. దీంతో ఆర్జీవి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అయితే ఆ తర్వాత అర్ధరాత్రి టైములో రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ సిబ్బంది కేసు విత్ డ్రా చేసుకోవటంతో పోలీసులు పవన్ అభిమానులను వదిలి పెట్టేశారు.

 

ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ కేసు విత్ డ్రా చేసుకుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు భయపడా..? లేకపోతే సినిమాకి ప్రమోషన్ రావాలని డ్రామా ఆడినట్టా ? అన్నది ఎవరికీ అర్థం కాకుండా పోయింది. మరోపక్క ఈ ఘటన జరిగిన తర్వాత రాంగోపాల్ వర్మ వరుసపెట్టి ఇంటర్వ్యూల  మీద ఇంటర్వ్యూ లు ఇస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో బిజీ బిజీగా గడుపుతున్నారు . అయితే ఆర్జీవీ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది… కేవలం కరోనా టైమ్లో ప్రమోషన్ చేసుకోలేని ఆర్జివి పవన్ అభిమానులను రెచ్చగొట్టి ఈ విధంగా డ్రామా ఆడి తన “పవర్ స్టార్” సినిమాకి హైప్ తెచ్చుకున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: