బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ అక్కడ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నా దక్షిణాది వైపు కూడా ఫోకస్ పెట్టింది హీరోయిన్ అలియాభట్. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కి జోడీగా చేస్తుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఆమె కు మంచి మార్కెట్ ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆమెకే ఎక్కువగా వస్తాయి.

 దీంతో ఈమెకు అక్కడ రేంజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే భారతీయ సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో బయోపిక్ లు బాగా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. మంచి కథ ఉండి ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్ ఉంటే దాన్ని బయోపిక్ లుగా తెరకెక్కించడం లో ఎలాంటి ఆలోచన చేయడం లేదు మేకర్స్. చరిత్ర లో విజయం సాధించిన మహిళల బయోపిక్ లను సైతం చేస్తున్నారు. వారి గురించి ప్రపంచానికి తెలియడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ తరహా సినిమాలు ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా తెరకెక్కించాలి.


లేదంటే కొందరు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి అని వస్తరుం ఇప్పటికే చాలా సినిమా ల విషయాల్లో ఇది జరుగుతుంది. అలా ఆలియా భట్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గంగు భాయ్ కథియవాడి సినిమాపై వివాదం చెలరేగుతోంది.  ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి లోని మేడమ్ ఆఫ్ కామ తిపుర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో తన తల్లి పాత్రను చిత్ర దర్శకుడు కించపరిచారంటూ గంగుబాయి కుమారుడు బాబూజీ శా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు బాంబే హైకోర్టు లో ఉంది.  ఇప్పటికే చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, ఆలియా భట్, రచయిత హుస్సేన్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ నవలలోని కొన్ని సన్నివేశాలు అవమానకరంగా ఉన్నాయని దీనివల్ల తమ కుటుంబంపై ప్రజలు ద్వేషం పెంచుకుంటున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  సెప్టెంబర్ 7న ఈ కేసు విచారణ చేపట్టనుంది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: