టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పేపర్ బాయ్ ... ఏక్ మినీ కథ ... మంచి రోజులు వచ్చాయి ... లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ లతో ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్న ఈ యువ హీరో తాజాగా కళ్యాణం కమనీయం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.

మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. యూవీ క్రియేష‌న్స్ అనుబంధం సంస్థ యూవీ కాన్సెప్ట్స్‌ ఈ మూవీ ని నిర్మించింది. అనిల్ కుమార్ ఆళ్ల ద‌ర్శ‌క‌త్వం వహించిన ... ఈ మూవీ కి కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరించగా ... ఈ మూవీ కి  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. 

ఇది  ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జనవరి 5 వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ... ఈ ట్రైలర్ ను డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుష్క శెట్టి విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: