
అంతే కాకుండా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేశారని కూడా వార్తల వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం పది రోజులు మాత్రమే డేట్లు కేటాయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 15 వరకు ఈ సినిమా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ తర్వాత వినోదయ శీతమ్ రీమేక్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా షూటింగ్లో మే నెలలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన తేరి అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయా అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఈ చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ప్రకటించలేదు.