
బిచ్చగాడిగా దేవా పాత్రలో ధనుష్ అదరగొట్టేశాడని, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. అలాగే డ్యూయల్ షేడ్స్ ఉన్న దీపక్ పాత్రలో నాగార్జున జీవించేశాడని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. స్క్రీన్ ప్లే, దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాను మరింత లేపాయి. మంచి ఎమోషన్ తో సాగే సోషల్ డ్రామాగా కుబేర ప్రశంసలు అందుకుంటోంది. టాక్ అనుకూలంగా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించి ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
థియేట్రికల్ రిలీజ్ కు ముందే కుబేర డిజిటల్ హక్కులను విక్రయించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. ఇన్‌సైడ్ ట్రాక్ ప్రకారం.. కుబేర ఓటీటీ డీల్ రూ. 47 కోట్లకు క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. అయితే ఓటీటీలో కుబేర తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇర థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు