టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు విష్ణు మరో ఐదు రోజుల్లో కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు వెల్లడిస్తున్న విషయాలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. నా పూర్తి పేరు మంచు విష్ణువర్ధన్ బాబు అని అయినప్పటికీ అంతా విష్ణు అనే పిలుస్తారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. బాల్యంలో తాను ఒక సినిమాలో నటించినా ఇండస్ట్రీకి వస్తానని మాత్రం అనుకోలేదని చెప్పుకొచ్చారు. నాన్న నన్ను ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలని అనుకున్నారని అందుకే నేను బిటెక్ చేశానని విష్ణు కామెంట్లు చేశారు. బిటెక్ లాస్ట్ ఇయర్ సమయంలో నాన్న నాకు సినిమా రంగమే బెస్ట్ అని సూచించారని వెల్లడించారు.

ఉదయం నాలుగు గంటల సమయంలో నిద్ర లేస్తానని రాత్రి 10 గంటల లోపే నిద్రపోతాను అని ఎంత బిజీగా ఉన్నా జిమ్ మాత్రం తప్పనిసరి అని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. నా భార్యకు దేశ విదేశాల్లో బోటిక్లు ఉన్నాయని తొలిసారి వేరోనికాను చూసిన సమయంలో తన నవ్వుకు ఫిదా అయ్యానని విష్ణు కామెంట్లు చేశారు. పరిచయం ప్రేమగా మారి మా పెళ్ళికి దారితీసిందని మంచు విష్ణు పేర్కొన్నారు. నా పర్సనల్ స్టైలిస్ట్ గా కూడా నా భార్య విష్ణు చెప్పుకొచ్చారు. తాను పార్టీలకు దూరమని పిల్లలతో గడపడానికి ఆసక్తి చూపిస్తానని విష్ణు వెల్లడించారు.

సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలని అనిపించి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ చూస్తున్నానని వాళ్లంతా తనను అన్నా అని పిలుస్తారని ఆ సమయంలో నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా అనిపిస్తుందని సైనికుల పిల్లలకు మా విద్యాసంస్థ తరపున స్కాలర్షిప్ ఇస్తున్నామని విష్ణు అన్నారు.

భక్తకన్నప్ప ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత శివుడిని ఆరాధిస్తున్నానని ఆ భక్తితోనే ద్వాదశ జ్యోతిర్లింగాలను చూసొచ్చానని విష్ణు చెప్పుకొచ్చారు. అటలపై ఉన్న ఇష్టంతో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నానని కన్నప్ప సినిమాలో కొన్ని యాక్షన్ సీన్లను నేనే డిజైన్ చేశానని మంచు విష్ణు అన్నారు. కన్నప్ప సినిమాలో మా ముగ్గురు పిల్లలు నటించారని విష్ణు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: