
ఎందుకంటే భారతదేశంలో ఉన్న 27 రాష్ట్రాలకు , 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక రాజ్యాంగం, కేవలం జమ్మూకాశ్మీర్‌కు మాత్రమే ఒక ప్రత్యేక రాజ్యాంగం. ఆర్టికల్ 370 అమలుతో ఒక ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని పొంది.. 90% రాయితీలు ని, కేంద్రం ఇచ్చే అదనపు గ్రాంట్లు, పన్ను మినహాయింపులు, మొదలగు రాయితీలను అనుభవించిన ఈ కాశ్మీర్ రాజకీయ నాయకులకు ఒక్కసారిగా కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేయడం తో తమ సొంత ఆస్తుల్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్లుగా ఇటీవల ఒక ఉర్దూ పత్రిక ఇంటర్వ్యూలో తమ బాధలు వెల్లడించారు.
వీరు ఆర్టికల్ 370 ని అడ్డు పెట్టుకొని కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు పెట్టి వాటికి లెక్క చెప్పకుండా అవినీతి నిరోధక శాఖ వెసులుబాటు లేని స్వతంత్రం ను పొందారు. అంతేకాకుండా మన దేశ నిధులతో పాకిస్తాన్ తీవ్రవాదులను గృహవాసులు గా చేసి దేశంలో సరిహద్దు సమస్యలను సృష్టించారు. ఇక 370 రద్దుతో వీరి ఆటలు సాగక పోవడంతో చేసేదేమీ లేక కాశ్మీర్ అంశంపై మరోసారి సమస్యలు ను సృష్టిస్తున్నారు. 70 ఏళ్లుగా భారత్ కాశ్మీర్ సమస్యతో ఎంత బాధ పడిందో వీళ్లకు అర్థం కావడం లేదు. వీళ్ళ ప్రయోజనాలే తప్ప దేశ సమస్యలు వీళ్లకు అర్థం కావడం లేదు.