ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కేవలం రెండు పార్టీల మధ్యనే సాగుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అయితే మరొకటి గత రెండు మూడు సంవత్సరాల నుండి తెలంగాణలో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకుని ప్రజల దృష్టిలో ప్రత్యామ్నాయంగా నిలిచినా భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక బీజేపీ లో బలం వచ్చింది. మరి ఈటల రాజేందర్ బీజేపీ లోకి వెళ్లిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకే పార్టీలో కొంత కాలంగా కలిసి రాని చేసిన కేసీఆర్ మరియు ఈటల రాజేందర్ లు ఇప్పుడు పరమ శత్రువులుగా మారి పోయారు. ఎక్కడ కనపడినా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అయిపోతున్నారు.

తాజాగా ఈ రోజు కూడా ఈటల రాజేందర్ ఉద్యోగుల బదిలీలపై తెచ్చిన కొత్త జీవో 317 పై ప్రభుత్వంపై మరియు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇప్పటికే నర్సంపేట ఉద్యోగి రమేష్ ఆత్మహత్య ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేసీఆర్ పై ఆగ్రహాన్ని చూపించాడు. కేసీఆర్ తనకు నచ్చిన విధంగా తమకు అనుకూలంగా ప్రభుత్వాన్ని మార్చుకుంటున్నారు. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఉద్యోగుల పట్ల మొండిగా ఉంటున్నారని శివాలెత్తాడు ఈటల.

ఈ జీవోను వెనక్కు తీసుకోకపోతే ఉద్యోగుల ఆత్మహత్యలే శరణ్యమని రెచ్చిపోయి మాట్లాడాడు. మరి ఇకనైనా కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుని తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇలా పలు కీలక నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకువచ్చేలా ఉన్నాయి. దాదాపుగా ప్రజలలో వ్యతిరేకత వచ్చినట్లే ఉంది. ఈ పొరపాట్లు అన్నీ తెలుసుకుని సర్దుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదు కదా ? కనీసం డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఒక వైపు రాజకీయ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: