మొదటిరౌండు ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) విచారణ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి పెద్ద డ్రామానే నడిపినట్లు సమాచారం. విచారణ జరిగిన తీరుగురించి కొంత సమాచారం సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది. ఈడీ ఆఫీసుకు చేరుకునేముందే సోనియా ఒక రిక్వెస్టు పెట్టుకున్నారట. అదేమంటే తనకు ఆరోగ్యం సరిగాలేదు కాబట్టి వ్యక్తిగత డాక్టర్ ను వెంటతెచ్చుకుంటానని. అలాగే వ్యక్తిగత సహాయకుడు, ఒక లాయర్ కూడా తనతోనే ఉండాలని చెప్పారట.





సరే సోనియా అంటే మామూలు వ్యక్తి కాదుకదా. పైగా తీవ్ర ఆనారోగ్యంనుండి కోలుకున్నారు కూడా. అందుకనే ఈడీ కూడా సోనియా రిక్వెస్టును కొన్ని షరతులు విధించి ఓకే చెప్పిందట. సోనియాతో వచ్చేవారు ఎవరైనా సరే విచారిస్తున్న గదిబయటే ఉండాలనేది ఈడీ పెట్టిన ప్రధానమైన కండీషన్. అయితే విచారణకు హాజరైన సోనియా తన వ్యక్తిగత సహాయకురాలిని అనుమతించాలని పట్టుబట్టారట. ఎవరా సహాయకురాలని చూస్తే కూతురు ప్రియాంకాగాంధీయేనట. అంటే కూతురినే వ్యక్తిగత సహాయకురాలిగా చెప్పి విచారణ జరిగే చోటుకి తెచ్చుకున్నారు.





ఇక విచారణలో చాలాప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పలేదట. చాలావాటికి ఏమో నాకు తెలీదు..ఏమో నాకు గుర్తులేదు..ఏమో చనిపోయిన మోతీలాల్ ఓరానే అన్నీ చూసుకునేవారు..ఓరా ఎక్కడ సంతకాలు పెట్టమంటే నేను పెట్టేదాన్నంతే అని చనిపోయిన ఓరామీదకు తోసేశారట. ఒకదశలో ప్రియాంక విచారణ గదిలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే ఈడీ అధికారులు గట్టిగా అడ్డుకున్నట్లు సమాచారం.





అధికారులు వేసిన చాలా ప్రశ్నలకు అసలు సమాధానాలే చెప్పలేదట. కొన్నింటికి మాత్రం గ్యాప్ తీసుకుని ఏవో పొడిపొడిగా సమాధానాలిచ్చారట. తనకు నీరసంగా ఉందని, తాను కూర్చోలేకపోతున్నానని చెప్పారట. మొత్తంమీద సోనియాను విచారించేందుకు పిలిపిస్తే చివరకు అధికారుల సహనానికే సోనియా పరీక్ష పెట్టారన్నమాట. మొత్తంమీద అప్పట్లో రాహూల్ గాంధీ అయినా ఇపుడు సోనియానుండి అయినా ఈడీకి కావాల్సిన సమాచారం అందలేదని అర్ధమైపోతోంది. ఇంతోటిదానికి మంగళవారం రెండోరౌండు విచారణ కూడా జరిగింది. మరిపుడు లోపల సోనియా ఇంకేమి సీన్ చేశారో తెలియాల్సుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: