కరోనా తర్వాత జరుగుతున్న ఐసీసీ టోర్నీ కావడంతో ఎంతో కట్టుదిట్టంగా ఏర్పాటు జరిగాయి. ఈ ప్రపంచ కప్ కు యూఏఈ మరియు ఒమన్ దేశాలు ఆతిధ్యం ఇచ్చాయి. మొన్న ముగిసిన ఐపీఎల్ ఎంతో సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఈ నమ్మంతోనే ఐసీసీ వరల్డ్ కప్ ఇక్కడ నిర్వహిస్తోంది. ప్రస్తుతం మెయిన్ లీగ్ ఇంకా మొదలు కాలేదు. క్వాలిఫైయర్ మ్యాచ్ లు మాత్రమే సాగుతున్నాయి. ఇప్పుడే అసలైన క్రికెట్ మజా చూపిస్తున్నాయి చిన్న దేశాలు. క్రికెట్ అంటే ఎంతో ఫాషన్ తో ఈ సారి కొత్త టీం లు వరల్డ్ కప్ మెయిన్స్ కు అర్హత సాధించడానికి క్వాలిఫయర్స్ ఆడుతున్నాయి. అందులో భాగంగా గ్రూప్ ఏ నుండి శ్రీలంక మరియు ఐర్లాండ్ మధ్యన మ్యాచ్ జరుగుతూ ఉంది. మొదట టాస్ గెలిచి ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ప్రస్తుతానికి ఐర్లాండ్ ఆడిన ఒక్క మ్యాచ్ లో నెదర్లాండ్ పై విజయం సాధించింది. అదే విధంగా శ్రీలంక నమీబియా ను మట్టికరిపించింది. అయితే సూపర్ 12 కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం. ఇదే గ్రూప్ లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా నెదర్లాండ్ ను నమీబియా ఓడించింది. దీనితో నెదర్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. వరల్డ్ కప్ చరిత్రలో నమీబియాకు ఇదే తొలి విజయం. అయితే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ అద్బుతమయిన బౌలింగ్ తో వరుస బంతుల్లో వికెట్లను తీసి శ్రీలంకకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

అయితే ఆ తర్వాత నిస్సంక తో జత కలిసిన హాసరంగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. శ్రీలంక కనుక జాగ్రత్తగా ఆడకుంటే ఐర్లాండ్ చేతిలో షాక్ తినక తప్పదు. గతంలో ఇంగ్లాండ్ కు ఎటువంటి షాక్ ఇచ్చిందో ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.  సంచలనాలకు మారుపేరుగా ఐర్లాండ్ ను చెప్పుకోవచ్చు. ఈ పిచ్ పై 160 కొట్టినా డిపెండ్ చేయడం కష్టంగా మారవచ్చు.  కాబట్టి మంచి గౌరవప్రదమయిన స్కోర్ ను కొట్టడానికి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: