
58 శాతం రిజర్వేషన్ అమలు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మళ్లీ పెంచుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలు అడగవని గ్యారంటీ ఏంటీ? ఏకంగా 99 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరితే అప్పుడెలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉంటే వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను ఇష్టారీతిన పెంచి దాని అమలు చేయాలని చూస్తాయి. అలాంటి సమయంలో మిగతా వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా రిజర్వేషన్లను ఇష్టారీతిన పెంచుకుంటూ పోతే కుల రాజకీయాలు పెరిగిపోతాయి. రాబోయే కాలంలో మత రాజకీయాలు పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి.. రాజ్యాంగం ప్రకారం.. ఎవరూ దానికి అర్హులు అనే విషయాలను మరిచి ఏ ప్రభుత్వం దాని అనుకూల విధానాలతో మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పెంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజర్వేషన్ల పెంపు వల్ల కలిగే ఇబ్బందులను కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వాలు,ప్రతిపక్షాలు కలిసి దీని వల్ల కలిగే లాభ నష్టాలు గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.