మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి డైరెక్షన్లోనే కాదు రైటింగ్లో కూడా వరుసగా విజయాలు సాధిస్తూ ఉన్నాడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా అనేసరికి ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేశాడో అనే విషయంపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. మహేష్ బాబు కెరియర్ లో 28వ ప్రాజెక్టుగా ఇక ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు రివీల్ కాలేదు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్ చర్చల్లోకి వచ్చినట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.


 వార్తలు అయితే వచ్చి పోయాయి కానీ అటు చిత్ర బృందం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అని చెప్పాలి. అయితే త్రివిక్రమ్ ఇక మహేష్ బాబు సినిమా కోసం ఒక టైటిల్ అనుకుంటే మహేష్ బాబు మాత్రం దాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ అమ్మ మాట అనే ఒక టైటిల్ను మహేష్ సినిమా కోసం అనుకున్నాడట. అయితే ఆ టైటిల్ మాత్రం హీరో మహేష్ కి అంతగా నచ్చలేదట. టైటిల్ బాగున్నప్పటికీ నేటి జనరేషన్ కు అది సరిపోదని మరొక టైటిల్ ఉంటే చూడమని త్రివిక్రమ్ కు సూచించారట.
 దీంతో ఇక మహేష్ బాబుకు టైటిల్ నచ్చలేదు అన్న కారణంతో అటు త్రివిక్రమ్ కూడా ఆలోచనలో పడిపోయారట. మహేష్ చెప్పిన మాటలను బట్టి ఇక కథకు సెట్ అయ్యే విధంగా మరో టైటిల్ గురించి త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ చర్చల్లో భాగంగా ఆరంభం అనే టైటిల్ కూడా తెరమీదికి వచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ ఉంది. అయితే ఈ టైటిల్ విషయంలో ఇప్పటివరకు చిత్ర బృందం  మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది తెలుస్తుంది. ఇక త్వరలోనే టైటిల్ గురించి ఆలోచించి ఒక మంచి క్యాచీ టైటిల్ను అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. ఉగాది రోజున డేట్ ఫిక్స్ చేసి అదే రోజున టైటిల్ తో పాటు స్పెషల్ లుక్ ను కూడా విడుదల చేయాలని త్రివిక్రమ్  డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: