
దీంతో ఈ సినిమా కొన్న ఎగ్జిక్యూటర్స్ సైతం తమ డబ్బు కాస్తయిన వెనక్కి ఇవ్వాలంటు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మొదట ఇస్తానని చెప్పగా ఆ తరువాత వీటి గురించి అసలు పట్టించుకోలేదు.కానీ గత కొద్ది రోజుల క్రితం నిర్మాత హీరోయిన్ ఛార్మి మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని తెలియజేసింది. పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని హీరో రామ్ పోతినేనితో ప్రకటించగా అప్పటినుంచి మరొకసారి మళ్ళీ లైగర్ ఎగ్జిబిటర్స్ ధర్నా చేయడం జరిగింది.
దీంతో కొంతమంది ఎగ్జిక్యూటర్స్ వరంగల్ శ్రీను తన ఆఫీసుకు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారని అతను మాత్రం ఎవరితో కూడా టచ్ లో లేరని పూరి జగన్నాథ్ కు అవకాశం ఇవద్దని నిర్మాతలను కోరుతున్నామంటూ పలువురు లైగర్ సినిమా ఎగ్జిబిటర్స్ సైతం కోరుకుంటున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు పూరి జగన్నాథ్ ను ఇబ్బంది పెడుతుందో చూడాలి మరి. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ పలు రకాలుగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. మరి రామ్ సినిమాతో నైనా తన కెరీయర్ని మార్చుకుంటారేమో చూడాలి మరి.