
బాలికపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని స్థానిక ప్రజలు నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన నాగపూర్‌లో జరగగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగ్‌పూర్‌కు చెందిన వైద్య అనే వ్యక్తి స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఫైనాన్స్ తీసుకున్న వారి ఇంటికెళ్లి వాయిదాలు కలెక్షన్ చేయడం అతడి డ్యూటీ. విధుల్లో భాగంగానే రోజూ ఓ ఇంటికెళ్లి డబ్బులు కలెక్ట్ చేసేవాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ దుర్మార్గుడి కళ్లు ఆ కుటుంబంలోని బాలికపై పడ్డాయి.
ఎలాగైనా బాలికను లైంగికంగా లొంగ తీసుకోవాలని నిశ్చయించుకుని ఇంటికి వెళ్లిన ప్రతీసారి ఏదో ఒక గిప్ట్ ఇస్తూ ప్రేమగా ఉంటున్నట్లు నటించడం మొదలు పెట్టాడు. ఎప్పటిలాగే గత ఆదివారం కూడా వారి ఇంటివద్దకు వైద్య కలెక్షన్‌కు వెళ్లాడు. ఇంటికెళ్లిన సమయంలో ఇంట్లో పెద్ద వాళ్లెవరు లేకపోవడాన్ని గమనించాడు. బాలికను మభ్యపెట్టిన వైద్య ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో కొద్దిపాటి దూరంలో ఉన్న ఆమె తల్లి ఇంట్లోకి వచ్చింది.
బాలికతో అసభ్యకర రీతిలో కనిపించిన వైద్యపై దాడి చేసింది. కాలర్ పట్టుకుని బయటకు లాక్కెళ్లింది. విషయం అర్థం కావడంతో స్థానికులు వైద్య బట్టలు చించేసి..పూర్తి నగ్నంగా మార్చారు. అనంతరం పురవీధుల గుండా నగ్నంగా ఊరేగించారు. మరో కామాంధుడు ఇలాంటి సాహసం చేయవద్దనే ఉద్దేశంతోనే ఈ పనికి పూనుకున్నట్లు స్థానికులు ఆవేశంతో చెప్పారు. చట్టాలు బలంగా లేకపోవడంతోనే కామాంధులు రెచ్చిపోతున్నారని వాపోయారు. దేశంలో సరైన చట్టాలు లేనప్పడు ఇలాంటి వరకు సమాజమే బుద్ధి చెబుతుందని చెప్పుకొచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కామాంధులను ఉరితీయాలని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్న విషయం తెలిసిందే. వరుస ఘటనలతో దేశ ప్రజల ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది. దిశాపై జరిగిన హత్యాచారం సోమవారం పార్లమెంటును కుదిపేసిన విషయం తెలిసిందే.