
నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించగా.. తాజాగా మరోసారి లాక్‌డౌన్ విధేంచేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్ లో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ నెల 15- 21 వరకు లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలు అయిన పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణ వస్తువులు లభించే దుకాణాలను తెరవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మార్చి 15 నుంచి నాగపూర్‌లోని అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని..
ప్రజలందరూ సహకరించాలని పోలీసు ఉన్నతాధికారి కోరారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధించాలని ఆలోచిస్తుంది..తాజాగా మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే అత్యధికంగా 13,659 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచే 60 శాతం కేసులుండటం గమనార్హం. నాగపూర్‌లో కూడా 1,710 కేసులు నమోదయ్యాయి.. ఇకపోతే ఇదే దారిలో కేరళ, హర్యానా , ఏపి ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ లాక్ డౌన్ అంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతారని ఆలోచనలో పడ్డారు. వ్యాక్సిన్ వచ్చిన కూడా ఇలా మళ్లీ కరోనా ప్రభావం పెరగడం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే కనుక నిజమైతే ఏమౌతుందో చూడాలి..