
ఉత్తరాఖండ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్కు చెందిన 78 ఏళ్ల బామ్మ పుష్ప ముంజయల్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అమితంగా అభిమానిస్తా ఉంటుంది. అయితే ఇక దేశానికి రాహుల్ గాంధీ అవసరం ఎంతగానో ఉంది అంటూ సదరు చెబుతుండటం గమనార్హం. తన పేరుమీద ఉన్న 50 లక్షల విలువైన ఆస్తులు 10 తులాల బంగారం రాహుల్కు చెందేలా వీలునామా రాయడం సంచలనంగా మారిపోయింది. పీసీసీ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లిన సదరు బామ్మ రాహుల్ పేరు పైన తన ఆస్తులను బదలాయిస్తున్నట్లు వీలునామా రాసి ఆయనకు అందజేసింది.
ఇక ఈ వీలునామాన్ని అటు కోర్టులో కూడా సమర్పించడం గమనార్హం. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎన్నో త్యాగాలు చేసింది అంటూ సదరు బామ్మ చెబుతోంది. ఇక రాహుల్ గాంధీ అభిప్రాయాలు సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరమని తెలిపింది. మరణానంతరం తన ఆస్తులని రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశానని ఇక ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పినట్లు చెప్పుకొచ్చింది 78 ఏళ్ల పుష్పా ముంజయల్. ఇక ఈ బామ్మ తీసుకున్న నిర్ణయంపై ఎంతోమంది షాక్ అవుతున్నారు.