ఐపీఎల్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల  చెన్నై సూపర్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులందరికీ కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో 14వ ఓవర్ వేయడానికి వచ్చాడు రవీంద్ర జడేజా. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సందించిన తొలి బంతిని మయాంక్ అగర్వాల్ స్ట్రైట్ షాట్ ఆడాడు. అయితే రవీంద్ర జడేజా కు క్యాచ్ తీసుకునే అవకాశం వచ్చింది. కానీ అదే సమయంలో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న క్లాస్సేన్ క్యాచ్ అందుకునేందుకు సిద్ధమవుతున్న జడేజాకీ అడ్డు వచ్చాడు. దీంతో జడేజా ఒక్కసారిగా కింద పడిపోయాడు. క్యాచ్ మిస్ అయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా క్లాసేన్ కావాలని అడ్డుకున్నాడు అన్న విషయం మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన రవీంద్ర జడేజా సీరియస్ లుక్ ఇస్తూ ఇదేంటి అంటూ ప్రశ్నించాడు. అయితే ఇలా జడ్జ క్యాచ్ పట్టకుండా అడ్డు వచ్చి క్లాసేన్ మయాంక్ అగర్వాల్ కు లైఫ్ ఇచ్చినప్పటికీ.. మయాంక్ మాత్రం అదే ఓవర్లో వికెట్ కోల్పోయాడు. జడేజా వేసిన అదే ఓవర్లో ఐదో బంతికి స్టంప్ అవుట్ గా వెనుతిరిగాడు మాయాన్ అగర్వాల్. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని ఆడెందుకు మయాంక్ అగర్వాల్ ఫ్రెంట్ ఫుట్ కి వచ్చాడు. అయితే బంతి మిస్ అయి ధోని చేతుల్లోకి వెళ్ళింది.. ఇక ధోని చేతుల్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇక మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేసి మయాంక్ అగర్వాల్ ను పెవిలియన్ పంపించాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: