కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త కొత్త వెరైటీస్ చేసి పెడుతుంటే సంతృప్తిగా తింటూ ఉంటారు. చాలా మందికి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. దీన్ని భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటి వారికీ యమ్మీ ఆలు చికెన్‌ బిర్యానీ రుచి చూపించాలి అనుకుంటున్నారా.. మరి ఇంకెందుకు ఆలస్యం ఆలు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం.

ఆలు చికెన్‌ బిర్యానీకి తయారీకి కావాల్సిన పదార్థాలు..
1. అరకిలో చికెన్
2. సగం ఉడికించిన అన్నం - ఒకటిన్నర కిలో
3. ఆలు - నాలుగు లేదా ఐదు (కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి)
4. దాల్చిన చెక్క - చిన్న ముక్క
5. యాలకులు - నాలుగు లేక ఐదు
6. మిరియాలు - కొన్ని
7. బిర్యానీ ఆకు - కొద్దిగా
8. పచ్చిమిర్చి - ఎనిమిది
9. ఉల్లిపాయ ముక్కలు - రెండు కప్పులు
10. కారం - సరిపడా
11. నిమ్మరసం - టేబుల్‌ స్పూను
12. కొత్తిమీర ఆకులు - కప్పు
13. కుంకుమపువ్వు - కొద్దిగా
14. ఉప్పు - రుచికి సరిపడ
15. నూనె - తగినంత
16. అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు

ఆలు చికెన్‌ బిర్యానీ తయారు చేసే విధానం:
ఆలు చికెన్‌ బిర్యానీకి ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పెట్టుకోవాలి. ఆ తరువాత ఓ పెద్ద గిన్నెలో చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పెట్టాలి. ఇక ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తరువాత అదే నూనెలో పచ్చి మిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేగినా తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లిముద్దను వేసుకోవాలి.

ఇక అన్నీ వేగిన తరువాత చికెన్‌ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఆ తరువాత ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా వేసుకోవాలి. ఇక దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్‌ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి. ఇక చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే టేస్టీ ఆలు చికెన్ బిర్యానీ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: