
ఇప్పుడు అవన్నీ పూర్తిగా ధ్వంసమై పనికి రాకుండా పోయాయి. చెల్లాచెదురుగా మారి సమాధులు ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ లో ఎక్కడెక్కడ రష్యా విధ్వంసం సృష్టించింది. ఎన్ని ప్రాంతాలను సమాధులుగా మార్చింది. ఎన్ని ఆసుపత్రులను, విలువైన ప్రదేశాలను ధ్వంసం చేసిందో చూపిస్తూ ఉక్రెయిన్ వీడియోలు బయటపెట్టింది.
దీంతో ఒకప్పుడు అందంగా, చూడముచ్చటగా ఉండే నగరాలు సైతం శిథిలాల దిబ్బగా మారి శ్మశాన వాటికల్లా కనిపిస్తున్నాయి. దీన్ని ప్రపంచ దేశాలకు చూపించి రష్యా చేసిన దాడులతో ఉక్రెయిన్ ఎంతలా నాశనం అయిందో కళ్లకు కట్టినట్లు వీడియోలను బయట పెడుతోంది. ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చూసినా ఉక్రెయిన్ బాధ వర్ణనాతీతం. ఇంత దాడులు చేసి అందమైన ప్రదేశాలను నాశనం చేసి ఇప్పుడు వచ్చి రష్యా మా సమాధులను ఏలుతుందా అంటూ కన్నీటి పర్యంతమవుతోంది.
ఎక్కడ చూసిన శిథిల భవనాలు, కూలిపోయిన ఇండ్లు, దెబ్బతిన అంతస్తులు, బాంబుల దాడికి పెద్ద పెద్ద గోతులు ఒక్కటేమిటి యుద్ధం తర్వాత ఉక్రెయిన్ ను చూసి చలించకపోతే వారికి మనసు లేనట్లే. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చూస్తుంటే మహా భారతం గుర్తుకు రాక మానదు. 18 రోజులు జరిగిన మహా సంగ్రామం అనంతరం దుర్యోదనుడు అందరిని పోగొట్టుకుంటాడు. భీష్ముడు, కర్ణుడు, వంద మంది సోదరులు, అయినా వాళ్లు, ఆత్మీయులు, అందరిని కోల్పోయి చివరకు అచేతనుడిగా మిగిలిపోతాడు. అంతటి దీన పరిస్థితిలోకి తెస్తుంది యుద్ధం. అందుకే శాంతి యుతంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. యుద్ధాలతో ఎన్నటికీ సమస్యలు పరిష్కారం కావు.