చదువుల్లో బీటెక్ చదివారంటే అది ఒక గొప్ప క్రేజీలా, గొప్ప విషయంలా చెప్పుకుంటూ ఉంటారు. మా వాళ్ళు బీటెక్ అని. ఎందుకంటే అది చదివిన తర్వాత సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్లుగా సెట్ అయిపోవచ్చని, విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవచ్చని ఆలోచనతో కూడా చాలామంది ఈ బీటెక్ చదువుతూ ఉంటారు. ఇంక ఏ చదువు చదవకుండా, ఏ వృత్తి ఉద్యోగాలు కి వెళ్లకుండా ఓన్లీ బీటెక్ ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.


ఇప్పుడు దాని పర్యవసనం భారతదేశం ఫేస్ చేస్తుందని తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. లక్షలకి లక్షలు జీతాలు ఇచ్చే బడా బడా కంపెనీలు కూడా తమకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీసివేసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు తొలగించబడడంతో లే ఆఫ్ లలో ఎక్కువగా సఫర్ అయ్యేది భారతీయులే. ఇప్పుడు వరకు జరుగుతున్న జీవితానికి పెద్ద షాక్ అనేది వాళ్ళకి ఎదురైందని తెలుస్తుంది.


ఎక్స్పెన్షన్ కూడా ఎత్తివేస్తున్నారు అని తెలుస్తుంది. గూగుల్ తాజాగా కన్స్ట్రక్షన్ ఆఫ్ మాసివ్ సిలికాన్ వ్యాలీ క్యాంపస్ ను ఆపేసింది. గూగుల్ తనకి ఆదాయం తగ్గినటువంటి నేపథ్యంలో సిలికాన్ వ్యాలీలో పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తానని గతంలో ప్రకటించినా, కానీ ఇప్పుడు దాన్ని ఆపేసినట్లుగా తెలుస్తుంది. సాఫ్ట్ వేర్  ఉద్యోగమే గొప్పదని భావించుకుంటూ వచ్చిన వాళ్లకి పెద్ద సమస్య ఎదురయింది ఇప్పుడు.


ఈ సమస్య అందరికీ వస్తుందని కాదు. కానీ రాబోయే కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గడ్డు కాలమేనని తెలుస్తుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగనంత వరకూ ఈ సమస్యకి ఒక సమాధానం దొరకదని తెలుస్తుంది. యుద్ధానికి దీనికి సంబంధం ఏంటంటే, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా రెసిషన్ ఇంపాక్ట్ పడేది సాఫ్ట్ వేర్  రంగం మీదే. ఆదాయ వనరులే లేనటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తుంది అనేదే ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: